Tuesday, August 28, 2007

మర్మయోగి--1963::యదుకుల కాంభోజి::రాగం



సంగీతం: ఘంటసాల
రచన: ఆరుద్ర
గానం: ఘంటసాల,లీల


రాగం::యదుకుల కాంభోజి

పహడి హిందుస్తాని (యదుకుల కాంభోజి)

ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..

నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు వొలికేను (2)
కొనగోటితో నిను తాకితే
పులకించవలయు ఈ మేను

!! నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
!!
నిదురించవోయి వడిలోన
నిను వలచెనోయి నెరజాణ
(2)అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిమిషాన

!! నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి
ఆహాహ...హాహా...ఒహొహోహో... !!

No comments: