Showing posts with label పూజ--1979. Show all posts
Showing posts with label పూజ--1979. Show all posts

Monday, November 24, 2014

పూజ--1975::మారుబిహాగ్::రాగం


















సంగీతం::రాజన్-నాగేద్ర
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,వాణిశ్రీ, సావిత్రి,కాంతారావు, సూర్యకాంతం,మిక్కిలినేని, రేలంగి

మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా    
మనసులోని మమతల..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా    
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా

చరణం::1

నిప్పు రగిలి రేగు జ్వాల..నీళ్ల వలన ఆరునూ
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ 
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా 
మనసులోని మమతలన్నీ..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా    
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా    

చరణం::2

కడలిలోన ముసుగు వేళ..పడవ మనకు తోడురా 
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో..తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన..మనమంతా పాపులం

Friday, December 09, 2011

పూజ--1979







చిమ్మటలోని ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::రాజన్‌నాగేద్ర
రచన::దాశరధి
గానం::S.P.బాలు 

తారాగణం::రామకృష్ణ,వాణిశ్రీ, సావిత్రి,కాంతారావు, సూర్యకాంతం,మిక్కిలినేని, రేలంగి

పల్లవి::

అహహహ ఎహెహెహె లాలలల లాలలల
అంతట నీ రూపం..నన్నే చూడనీ
ఆశలు పండించే..నిన్నే చేరనీ
నీకోసమే నా జీవితం..నాకోసమే నీ జీవితం

అంతట నీరూపం..నన్నే చూడనీ
ఆశలు పండించే..నిన్నే చేరనీ

అహహహ ఎహెహెహె లాలలల లాలలల

చరణం::1

నీవే లేని వేళ..ఈ పూచే పూవులేల
వీచే గాలి వేసే ఈల..ఇంకా ఏలనే
కోయిల పాటలతో పిలిచే నా చెలీ
ఆకుల గలగలలో నడిచే కోమలీ

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ

అహహహ ఎహెహెహె లాలలల లాలలల

చరణం::2

నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలూ
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే
తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా
నీ చిరు నవ్వులకై వెతికే నా ఎదా

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ

అహహహ ఒహొహొ లాలలల అహహహ ఎహెహెహె ఒహొహొ

Sunday, August 19, 2007

పూజ--1979::దేశ్::రాగ్






















!! రాగం::దేశ్ !!
సంగీతం::రాజన్-నాగేంద్ర 

రచన::దాశరథి
గానం::వాణీ జయరాం 

పూజలు చేయా పూలు తెచ్చానూ
పూజలు చేయా పూలు తెచ్చానూ
నీ గుడి ముందే నిలిచానూ
తీయరా తలుపులనూ రామా
ఈయరా దర్శనమూ రామా

!! పూజలు చేయా పూలు తెచ్చానూ !!

తూరుపు లోనా తెల తెల వారే
బంగరు వెలుగూ నింగిని చేరే2
తొలికిరణాలా ఆ.. ఆ.. ఆ.. ఆ..
తొలికిరణాలా హారతి వెలిగే
ఇంకా జాగేలా స్వామీ
ఈయరా దర్శనమూ రామా

!! పూజలు చేయ పూలు తెచ్చానూ !!

దీవించేవో కోపించేవోచెంతకు చేర్చీలాలించేవో
నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ
ఈయరా దర్శనమూ రామా
పూజలు చేయా పూలు తెచ్చానూ
నీ గుడి ముందే నిలిచానూ
ఈయరా దర్శనమూ రామా

!! పూజలు చేయా పూలు తెచ్చానూ !!


DES::Raag 

Pooja--1975
Music::Rajan Nagendra  
Singers::Vani Jayram  
Lyricist::Dasarathi 
Cast::Ramakrishna, Vanisri 


Pujalu cheya poolu techaanu

Pujalu cheya poolu techaanu
nee gudi munde nilichaanu
teeyaraa talupulanu raama
eeyaraa darisanamu raama

Pujalu cheya poolu techaanu

Toorupu lone tela tela vaare
bangaru velugu ningini chere
toli kiranaala..aaa...
toli kiranaala haarati velige
inkaa jaagela saami
eeyaraa darisanamu raama

Poojalu cheya poolu techaanu

Deevinchevo kopinchevo
chentaku cherchi laalinchevo
nee pada sannidhi naa paaliti pennidhi
ninne nammitiraa saami
eeyaraa darisanamu raama

Pujalu cheya poolu techaanu
nee gudi munde nilichaanu
eeyaraa darisanamu raama

Poojalu cheya poolu techaanuu...

పూజ--1979







సంగీతం:: రాజన్-నాగేంద్ర
రచన:: దాశరథి
గానం::S.P.బాలసుబ్రమణ్యం,వాణీ జయరాం


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

!! ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీది !!

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహో హొ హొ నువ్వు కడలివైతే
నే నదిగ మారిచిందులు వేసి వేసి నిన్ను
చేరనా..చేరనా..చేరనా

!!ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీది !!

విరిసిన కుసుమము నీవై మురిపించేవూ..
తావిని నేనై నిన్నూ పెనవేసేను..
ఓ..హొ...హొ...హొ..
మేఘము నీవై నెమలినీ నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా...ఆడనా...పాడనా...

ఆ..హా..ఓ..హొ...ఆ...ఆ...

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ..నేనుండాలి
ఓహో హొ హొ నీ ఉన్నవేళా
ఆ స్వర్గమేలాఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ..ఉండనీ..ఉండనీ...

!! ఎన్నెన్నో..ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ..ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను 2
ఆహాహ హాహ..ఓహోహొహోహో !!
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

పూజ--1979







సంగీతం::నాగేంద్ర-రాజన్
రచన::దాశరథి 
గానం::S.P.బాలు,వాణీ జయరాం

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
లలలలలా.....

!! నింగీ నేలా ఒకటాయెలే !!

ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
హౄదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే ...నేనే నీవు లే
లలలలలా.....

!! నింగీ నేలా ఒకటాయెలే !!

రేయయినా పగలైన నీపై ద్యానము
పలికింది నాలోన వీణా గానము
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ ... నీవే రూపము
లలలలలా.....
!!నింగీ నేలా ఒకటాయెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే 2 !!


Pooja--1975
Music::Rajan Nagendra  
Singers::Balu,Vani Jayram  
Lyricist::Dasarathi 
Cast::Ramakrishna, Vanisri  kannada Arati

niMgee naelaa okaTaayelae
mamataloo valapuloo poolai viriselae
mamataloo valapuloo poolai viriselae
lalalalalaa.....

!! niMgee naelaa okaTaayelae !!

innaaLLa aeDabaaTu naeDae teerelae
naa veMTa neevuMTae eMtO haayilae
hRudayaalu jata jaeri oogae vaeLalO
dooraalu bhaaraalu laenae laevulae
neevae naenu lae ...naenae neevu lae
lalalalalaa.....

!! niMgee naelaa okaTaayelae !!

raeyayinaa pagalaina neepai dyaanamu
palikiMdi naalOna veeNaa gaanamu
adharaala kadiliMdi needae naamamu
kanulaMdu mediliMdi needae roopamu
needae roopamoo ... neevae roopamu
lalalalalaa.....

!!niMgee naelaa okaTaayelae
mamataloo valapuloo poolai viriselae 2 !!