Friday, May 22, 2009

కధానాయకుడు--1969


సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P. సుశీల


ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..

ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
తనకు తానై నా రాజు నాతో..
తనకు తానై నా రాజు నాతో..మనసుకలిపే నమ్మా...ఆ..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..

ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా..ఆ
ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..

కధానాయకుడు--1969


సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P.సుశీల బౄందం


మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్

మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్
మంచివాడు మా బాబాయీ..

రామలక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
రామలక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
నీతికి నిలిచే మీ తమ్మునిపై
నిందలెందుకయ్యా...

మంచివాడులే మా నాన్నా
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్
మంచివాడులే మా నాన్నా..ఈ..ఈ..

అమ్మా నాన్నవలె చూచే
అన్నా వదినా వున్నారు
అమ్మా నాన్నవలె చూచే
అన్నా వదినా వున్నారు
అన్నయ్యేదో అనగానే
అలుక ఎందుకయ్యా..అలుక ఎందుకయ్యా
మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ

మంచిమనసుతో బాబాయీ
మనకు కానుకలు తెచ్చాడూ
మూగనోములు విడవాలీ
ముగ్గురుకలసి నవ్వాలీ
మూగనోములు విడవాలీ
ముగ్గురుకలసి నవ్వాలీ

మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్...
మంచివాడు మా బాబాయీ..
మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ..ఈ..ఈ..

Thursday, May 21, 2009

స్వప్న---1981



సంగీతం::సత్యం
సాహిత్యం::ఆత్రేయ
గానం::SP.బాలు


ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

మెరుపనీ పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పువ్వనీ పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం
ఏ రీతిగ నిన్ను పిలవాలో తెలియదు నాకు
ఏ రీతిగ..నిన్ను పిలవాలో తెలియదు నాకు
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమ..ప్రేమ..ప్రేమ..

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

తారవని అందామంటే నింగిలో మెరిసేవు
ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరి పోల్చాలో
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరి పోల్చాలో
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమ ప్రేమ ప్రేమ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

Wednesday, May 20, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,కె.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు
నిదుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో 

చరణం::1
   
కన్నవారు నిన్ను గూర్చి ఎన్ని కలలు కన్నారో 
ఎన్ని కళ్ళు నిన్ను చూచి ఎర్రబడుతు ఉన్నయో
ఆ కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను 
కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను
ఆ కలలు పండే రోజు వరకు కంటిరెప్పగ ఉంటాను  
నిదురపో బాబూ నిదురపో 

చరణం::2

కొండకవతల సూర్యుడున్నాడు 
కోడికూస్తే లేచివస్తాడు
కారుచీకటి కప్పిపెట్టిన 
కల్లలన్నీ బయటపెడతాడు 
నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు 
దుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో

Sunday, May 17, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,K.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

గౌరమ్మోలే గౌరమ్మ గౌరమ్మోలే గౌరమ్మా 
నీ గుట్టు నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మా
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ..గౌరమ్మ

చరణం::1

బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
కొత్త కధలు చెప్పకు నాకు
కొత్త కధలు చెప్పకు నాకు
మెత్తగ వున్నాననుకోకు        
గౌరమ్మ గౌరమ్మ హోయ్ హోయ్ 
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ

చరణం::2

కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా గౌరమ్మ 
కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా
బిగువు సడలని ఈ సొగసు
పెళ్ళైయిన పిల్లకు వుంటుందా బిగువు 
సడలని ఈ సొగసు పెళ్ళైయిన పిల్లకు వుంటుందా      
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు నాకు తెలిసిపొయిందే 
గౌరమ్మా నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ గౌరమ్మ ఆ ఆ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::


అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం

ఆ పుణ్యస్థలి అడుగు మోపితే అడుగక దొరుకును ఆత్మానందం 

చరణం::1


పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా

పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా 
నీ పాద కమలములె మాకు శరణ్యము భద్రాచల రామా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే రామా 
భారము నీదే రామా భారము నీదే రామా

చరణం::2


లేక లేకనీ దర్శన భాగ్యము నేటికి కల్గిందీ

రామయ్య తండ్రీ రామయ్య తండ్రీ
రామయ్య తండ్రీ అని నొరారగ పిలవాలని వుంది 
కాని పిలువలేక నా గుండె గొంతుతో కొట్టుక చస్తూంది
పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టబోడు రామా
నీల మేఘశ్యామా శ్రీరామ పరంధామా
నన్నేలుకొమ్ము రామా భద్రాచల రామా
రామా రామా రామా రామా రామా

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి :

ఏదో మైకంలో ఉన్నాను నేను..హహహ
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను..నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

చరణం::1 

నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా మేనిలో నేడేలనో రగిలింది కనరాని జ్వాల..రగిలింది కనరాని జ్వాల  
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా 

చరణం::2

నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
ఈ రేయిలో ఈ వేళలో...తీరాలి 
ఇన్నాళ్ళ దాహం..తీరాలి ఇన్నాళ్ళ దాహం   
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా

చరణం::3

నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
ఆ రూపమే నా కోసమే..నిలిచింది 
నా కళ్ళలోన..నిలిచింది నా కళ్ళలోన  
     
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను...నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

Saturday, May 16, 2009

ఎర్ఱమల్లెలు --- 1981



సంగీతం::చక్రవర్తి
రచన::ప్రభు
గానం::S.P.శైలజ


నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
చేదామంటే కొలువూ లేదు,పోదామంటే నెలవు లేదు
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓ లింగా రామారాజ్యం తీరును చూడు శంభులింగ

గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టేసి కనిపెట్టి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓయ్ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

ముందు మొక్కులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ముందు మొక్కులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన సామి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఆ..లింగ..రామారాజ్యం తీరూచూడు
శివా..శంబులింగా..లింగ..
రామారాజ్యం తీరూచూడు..శివా..శంబులింగా

బొబ్బిలి రాజ--1990




సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి

Film Directed By::B.Gopal

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క

మారుమూల సోకుచేర లేఖ రాయనా..
చెరసాలు కోరు సంతకాలు తాకి చూడనా..
తేరి పార చూడనీ..దోర ఈడునీ..
చూర చూరు దాటనీ..వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని గొల్లగొట్టుకోనీ
సన్నజాజీ కత్తిరించు మల్లి కట్టుకోనీ
నా...జాలంగా..సంగా..సారంగా..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
మ్మ్..రాజా....ఐ లవ్ యూ....

తీగలాంటి నాటుచూపు నాటుకొన్నది
అలవాటులేని చాటుతోట మాటుకొన్నదీ
తీగలేని యవ్వనం..ఆదరించవా..
తీరవాలు మోజుతో..స్వాగతించవా..
రంగరంగ వైభవాల..మంటలేలుకోవా
గంగపొంగు సంబరాల..రంగుతేలనీవా
ఈ...ఈ చోటే...డార్లింగ్..అహ్హా..ఐ లవ్ యూ..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ..ఈ..ఈ..ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....

బొబ్బిలి రాజ--1990




సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి

Film Directed By::B.Gopal
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క

మారుమూల సోకుచేర లేఖ రాయనా..
చెరసాలు కోరు సంతకాలు తాకి చూడనా..
తేరి పార చూడనీ..దోర ఈడునీ..
చూర చూరు దాటనీ..వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని గొల్లగొట్టుకోనీ
సన్నజాజీ కత్తిరించు మల్లి కట్టుకోనీ
నా...జాలంగా..సంగా..సారంగా..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
మ్మ్..రాజా....ఐ లవ్ యూ....

తీగలాంటి నాటుచూపు నాటుకొన్నది
అలవాటులేని చాటుతోట మాటుకొన్నదీ
తీగలేని యవ్వనం..ఆదరించవా..
తీరవాలు మోజుతో..స్వాగతించవా..
రంగరంగ వైభవాల..మంటలేలుకోవా
గంగపొంగు సంబరాల..రంగుతేలనీవా
ఈ...ఈ చోటే...డార్లింగ్..అహ్హా..ఐ లవ్ యూ..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ..ఈ..ఈ..ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....