Friday, May 22, 2009

కధానాయకుడు--1969


సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P.సుశీల బౄందం


మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్

మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్
మంచివాడు మా బాబాయీ..

రామలక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
రామలక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
నీతికి నిలిచే మీ తమ్మునిపై
నిందలెందుకయ్యా...

మంచివాడులే మా నాన్నా
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్
మంచివాడులే మా నాన్నా..ఈ..ఈ..

అమ్మా నాన్నవలె చూచే
అన్నా వదినా వున్నారు
అమ్మా నాన్నవలె చూచే
అన్నా వదినా వున్నారు
అన్నయ్యేదో అనగానే
అలుక ఎందుకయ్యా..అలుక ఎందుకయ్యా
మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ

మంచిమనసుతో బాబాయీ
మనకు కానుకలు తెచ్చాడూ
మూగనోములు విడవాలీ
ముగ్గురుకలసి నవ్వాలీ
మూగనోములు విడవాలీ
ముగ్గురుకలసి నవ్వాలీ

మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ
కోపం మానీ తాపం మానీ
మాతో వుంటాడోయ్...
మంచివాడు మా బాబాయీ..
మంచివాడు మా బాబాయీ
మామాటే వింటాడోయీ..ఈ..ఈ..

No comments: