Showing posts with label Rain Songs. Show all posts
Showing posts with label Rain Songs. Show all posts

Friday, September 11, 2015

గీతాంజలి--1989



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::K.S.చిత్ర 
Film Directed By::Mani Ratnam
తారాగణం::నాగార్జున అక్కినేని,గిరిజా షెట్టర్,విజయకుమార్,విజయచంద్ర.

పల్లవి:: 

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే 
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే 
ఉరుకులో..పరుగులో 
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు 
తొలకరి..మెరుపులా 
ఉలికిపడిన కలికి సొగసు 

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే 
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే 

చరణం::1

వాగులు వంకులు గలగలా చిలిపిగా పిలిచినా 
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా 
మనసు ఆగదు ఇదేమి అల్లరో 
తనువు దాగదు అదేమి తాకిడో 
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి 
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి 

చరణం::2 

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా 
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా 
వానదేవుడే కళ్ళాపి జల్లగా 
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా 
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న 
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో ఒహో

Geetanjali--1989
Music::IlayaRaja
Lyrics::Veeturisundararaamamoorti
Singer::K.S.Chitra 
Film Directed By::Mani Ratnam 
Cast::Nagarjuna Akkineni, Girija Shettar, Vijayakumar, Vijayachander

::::::::: 

jallanta kavvinta kaavaalilE 
oLLanta tuLLinta raavaalilE 
jallanta kavvinta kaavaalilE 
oLLanta tuLLinta raavaalilE 
urukulO..parugulO 
uDuku vayasu duDukutanamu nilavadu 
tolakari..merupulaa 
ulikipaDina kaliki sogasu 

konDamma kOnamma mechchindilE 
enDallo vennellu techchindilE 
konDamma kOnamma mechchindilE 
enDallo vennellu techchindilE 

::::1

vaagulu vankulu galagalaa chilipigaa pilichinaa 
gaalulu vaanalu chiTapaTaa chinukulE chilikinaa 
manasu aagadu idEmi allarO 
tanuvu daagadu adEmi taakiDO 
kOnachaaTu konDamalle lEnivanka muddulaaDi 
veLLaDaaye kaLLu lEni dEvuDendukO mari 

::::2 

sandelO rangulE nosaTipai tilakamE nilupagaa 
teli teli manchulE teliyani tapanalE telupagaa 
vaanadEvuDE kaLLaapi jallagaa 
vaayudEvuDE muggEsi veLLagaa 
neelikonDa gunDelOni oosulanni telusukunna 
kotta paaTa puTTukochche evarikOsamO ohO

Thursday, September 10, 2015

స్వయంవరం--1982



సంగీతం::చెళ్ల పిళ్ల సత్యం
రచన::దాశరినారాయణరావు
గానం::K.J.ఏసుదాసు
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,నారాయణరావు,రావ్‌గోపాల్‌రావ్,గుమ్మడి.

పల్లవి::

గాలి వానలో..ఓఓఓ 
వాన నీటీలో..ఓఓఓ
గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం

గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

చరణం::1

ఇది హోరు గాలి అని తెలుసూ..ఊ
అటు వరద పొంగు అని తెలుసూ..ఊ
ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ
హోరు గాలిలో వరద పొంగులో..సాగలేనని తెలుసూ
అది జోరు వాన అని తెలుసూ..ఊ
ఇది నీటి సుడులని తెలుసూ..ఊ
అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ 
జోరు వానలో..నీటి సుడులలో..మునక తప్పదని తెలుసు 
ఐనా పడవ ప్రయాణం..తీరమెక్కడో గమ్యమేమిటో 
తెలెయదు పాపం..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

చరణం::2

ఇది ఆశ నిరాశల ఆరాటం..మ్మ్
అది చీకటి వెలుగుల చెలగాటం..మ్మ్
ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం 
ఆశ జారినా వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం 
ఇది మనిషి మనసుల పోరాటం..మ్మ్
అది ప్రేమ పెళ్ళి చెలగాటం..మ్మ్
ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం 
ప్రేమ శకలమై మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం 
ఐనా పడవ ప్రయాణం..తీరమెక్కడో గమ్యమేమిటో 
తెలెయదు పాపం..తెలెయదు పాపం

గాలి వానలో వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో..తెలెయదు పాపం
ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఓ

Swayamvaram--1982--1982
Music::Chellapalli Satyam
Lyrics::Dasari Naraayana Rao
Singer::K.J.Esudaas
Film Director::Dasari Naraayana Rao
Cast::Sobhanbaabu,Jayaprada,Naaraayanaraavu,RaoGopalRao,Gummadi.

:::::

gaali vaanalO..OOO 
vaana neeTeelO..OOO
gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam

gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

::::1

idi hOru gaali ani telusoo..oo
aTu varada pongu ani telusoo..oo
iTu hOru gaali ani telusoo
aTu varada pongu ani telusoo
hOru gaalilO varada pongulO..saagalEnani telusoo
adi jOru vaana ani telusoo..oo
idi neeTi suDulani telusoo..oo
adi jOru vaana ani telusoo..idi neeTi suDulani telusoo 
jOru vaanalO..neeTi suDulalO..munaka tappadani telusu 
ainaa paDava prayaaNam..teeramekkaDO gamyamEmiTO 
teleyadu paapam..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

::::2

idi aaSa niraaSala aaraaTam..mm^
adi cheekaTi velugula chelagaaTam..mm^
idi aaSa niraaSala aaraaTam..adi cheekaTi velugula chelagaaTam 
aaSa jaarinaa velugu tolaginaa..aagadu jeevita pOraaTam 
idi manishi manasula pOraaTam..mm^
adi prEma peLLi chelagaaTam..mm^
idi manishi manasula pOraaTam..adi prEma peLLi chelagaaTam 
prEma Sakalamai manasu vikalamai..bratukutunnadoka Savam 
ainaa paDava prayaaNam..teeramekkaDO gamyamEmiTO 
teleyadu paapam..teleyadu paapam

gaali vaanalO vaana neeTeelO..paDava prayaaNam
teeramekkaDO gamyamEmiTO..teleyadu paapam
O O O O o O O O O O o O O O O O o OOO

Sunday, July 05, 2015

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే
గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది  

చరణం::1

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ..అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ..అహ అహ

ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ..మాట విని మబ్బు మెరిసి..అహ
జడివానలే..కురిసి కురిసి 
వళ్ళు తడిసి..వెల్లి విరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

చరణం::2 

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే 
అహ అహ..అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే 
అహ అహ..అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ..నీ పాట విని మెరుపులొచ్చి..అహ
నీ విరుపులే..ముడుపు లిచ్చి
చలిని పెంచి..చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

Wednesday, June 10, 2015

బంగారు బుల్లోడు--1993



సంగీతం::రాజ్-కోటి
రచన::వేటూరి
గానం::బాలు,చిత్ర

పల్లవి::

వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా..వాగు వంకా మెచ్చేనంటా..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...
అందా..లెన్నో..యాలో..ఓ..ఓ..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

చరణం::1

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు..ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా..వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా..కాదయ్యో నీ గొప్పా
నీలో..మేఘం..నాలో దాహం..యాలో..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

చరణం::2

వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట

ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ..ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా..ముద్దేలే జేగంట
నాలో..రూపం..నీలో తాపం..యాలో..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో
అందా..లెన్నో
యాలో..ఓ..ఓ..యాల
వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా

Wednesday, April 15, 2015

గ్యాంగ్ లీడర్--1991



సంగీతం::బప్పీలహరి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు 

పల్లవి::

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి

చరణం::1

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె

చరణం::2

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
  
Gang Leade--1991
Music:: Bappi Lahari
Lyrics::bhuvanachandra
Singer;s::S.P.Baalu,KS.Chitra
Cast::Chiranjeevi,Vijayasaanti,RaoGopaalarao.

:::

vana vana velluvaye
konda kona thullipoye
cheliya choopule chilipi 
jallulai menu thakagaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
priyuni swaasale pilla 
gaalulai momu thakagaa
yedho yedho yedho hai

:::1

chakkani chekkili chindhe 
andhapu gandham
pakkana cherina magamaharaajuki 
sontham
hoo tholakari chitapata 
chinukulalo makarandham
chitthadi putthadi nelakane 
aanandham
chigurutaakulaa chaliki onukuthoo 
cheliya cheragaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye

:::2

okariki okarai hathukupoyina velaa
odilo regenu yedho theliyani jwaalaa
musirina cheekatilo chiru gaalula golaa
bigisina kougita kariginchenu paruvaalaa
kalavarinthale palakarimpulai
padhunu meeragaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
cheliya choopule chilipi 
jallulai menu thakagaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
priyuni swaasale pilla 
gaalulai momu thakagaa
yedho yedho yedho hai

Saturday, November 29, 2014

బుల్లెమ్మ బుల్లోడు--1972


















సంగీత::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన:: రాజశ్రీ
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 

పల్లవి::

కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు...కొసరే రాగాలు
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా

చరణం::1

అల్లరి చేసే ఆశలు నాలో..పల్లవి పాడేనూ
తొలకరి వయసు గడసరి మనసు..నీ జతకోరేనూ 
అల్లరి చేసే ఆశలు నాలో..పల్లవి పాడేనూ
తొలకరి వయసు గడసరి మనసు..నీ జతకోరేనూ
చలిగాలి వీచే...గిలిగింత తోచే
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా

చరణం::2

ఉరకలువేసే ఊహలు నాలో..గుసగుసలాడేనూ 
కథలను తెలిపే కాటుక కనులూ..కైపులు రేపేనూ
ఉరకలువేసే ఊహలు నాలో..గుసగుసలాడేనూ 
బిగువు ఇంకేలా...దరికి రావేలా
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Friday, August 01, 2014

ఆఖరి పోరాటం--1988



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.జానకి,S.P. బాలు
తారాగణం::నాగార్జున,శ్రీదేవి, సుహాసిని 

పల్లవి::

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్
లేలేత వణుకు అందగత్తెలో..హోయ్
మబ్బే కన్నుగీటే..అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట..హ్హా
భలే కదా గాలి ఇచ్చట..ఆ
భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్ 
లేలేత వలపు అందగాడిలో..హోయ్
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే
సరాగాలతోటే..స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

చరణం::1

ఈ గాలితో ఒకే చలి..ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమతో ఒకే గిలి..ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక..నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి..పదాలెన్నో పాడ
వరాలిచ్చిపోరా..వరించానులేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు..సాగిన వేళ కురిసిన

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్
లేలేత వణుకు అందగత్తెలో..హోయ్
మబ్బే కన్నుగీటే..అరె మతే పైట దాటే

సరాగాలతోటే..స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

భలే కదా గాలి ఇచ్చట..ఆ
భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..

చరణం::2

లలలాలలలా..లలలాలలలా
లలలాలలలా..తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
ఈ వానల కధేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీ కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో
తొలి వానల గిలిగింతలో పెనవేసిన కవ్వింతలో
ఎదే మాట రాక పెదాలందు ఆడ
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్ 
లేలేత వలపు అందగాడిలో..హోయ్
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట..హ్హా
భలే కదా గాలి ఇచ్చట..ఆ

భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

Wednesday, July 23, 2014

ప్రేమయుద్ధం--1990



సంగీతం::హంసలేఖ
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి
 Film Directed By::Rajendra Singh Babu
తారాగణం::నాగార్జున, అమల

పల్లవి::

స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతోరాతిరి గడిపేలాహిరి నిన్నేకడిగెనులే

స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నాతోరాతిరి గడిపేలాహిరి నన్నేకడిగెనులే

చరణం::1

ముసిరేసిందమ్మా కబురే కసిగా తెలిపీ
తడిగా వడినే దులిపీ జడివానేమ్చేస్తుందీ
జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువు తనువు కలిపీ
తనతో సగమే చెరిపీ చలిగాలేమ్చేస్తుందీ చెలికాడేతోడుంటే
ఆమెరుపులకే మెలితిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే
వయసులతో కురిసిందీ వానా తొలిగాపరువానా

స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతోరాతిరి గడిపేలాహిరి నిన్నేకడిగెనులే

చరణం::2

మతిపోయిందమ్మా మనసూ మనసూ కలిసీ
కధలూ కలలూ తెలిసీ జలపాతమ్ నీవైతే అలగీతమ్ నేనేలే
కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసీ ధివినీ భువినీ కలిపీ
సిరితాడే తెస్తాలే నీవినవే చేస్తాలే ఈచిటపటకీ శ్రుతికలిసే
వలపులతో ఈతపనులకే జతకలిసే తలపులతో కురిసిందీవానా 
తొలిగా పరువానా

స్వాతి ముత్యపు జల్లులలో శ్రావన మేగపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతోరాతిరి గడిపేలాహిరి నిన్నేకడిగెనులే 

Prema Yuddham--1990
Music::Hamsalekha
Lyrics::Atreya
Singer's::S.P.Balu S.Janaki
Cast::Akkineni Nagarjuna,Amala,MohanBabu,GiriBabu.
:::

Swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo
ninde dosili pande kougili ninne adigenule
neeto raatiri gadipe laahiri nanne Kadigenule

swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo
ninde dosili pande kougili nanne adigenule
neeto ratiri gadipe lahiri nanne kadigenule

:::1

musuresindammaa kabure kasigaa telipee tadiga odine dulipee
jadivaanem chestundee javaraale todunte
tadipesindammaa tanuvoo tanuvoo Kalipee tanato sagame cheripee
chaligaalem chestundee chelikaade todunte
aa merupulake meli tirige sogasulato 
ee vurumulake vulikipade vayasulato
kurisindee vaanaa toligaa paruvaanaa 

Swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo
ninde dosili pande kougili ninne adigenule
neeto raatiri gadipe laahiri nanne Kadigenule

:::2

matipoyindammaa manasu manasu Kalisi kadhalu kalalu telisi
jalapaatam neevaite ala geetam nenele
kasi regindammaa kalato nijame kalisi divinee bhuvinee Kalipi
siri taaralu testaale nee virule chestaale
ee chitapatake sruti kalise valapulato
ee tapanalake jata kalise talapulato
kurisindee vaanaa toligaa paruvaanaa 

Swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo
ninde dosili pande kougili ninne adigenule
neeto raatiri gadipe laahiri nanne Kadigenule

Thursday, March 07, 2013

ఘరానా మొగుడు--1992






సంగీతం::కీరవాణి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు , K.S.చిత్ర 
Film Director::K. Raghavendra Rao
తారాగణం::చిరంజీవి,నగ్మ,వాణివిశ్వనాథ్,రావుగోపాలరావు,కైకాలసత్యనారాయణ,బ్రహ్మనందం,రమాప్రభ,శుభ,
సాక్షిరంగారావు,డిస్కోశాంతి. 

పల్లవి::

కిటుకులు తెలిసిన..చిటపట చినుకులు
పిటపిటలాడిన..పరువపు..తళుకులు
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన
అబ్బబ్బా..ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వానా
అబ్బబ్బా..ఇది ఏమి వానా

చరణం::1

రివ్వున కొట్టిన ఓ చినుకూ..కసిగా పదమంటే
రైకను తట్టిన ఆ చినుకే..రైటు కొట్టమంటే
హత్తుకుపోయిన ఓ చినుకూ..వగలే ఒలికిస్తే
చెక్కిలి మీటిన ఆ చినుకే..సెగలు రేపుతుంటే
కురిసే ఒయ్యారి వాన..మెరిసే నీ కన్నుల జాణ
ఆ..కురిసే ఒయ్యారి..వాన మెరిసే నీ కన్నుల జాణా
ముదిరే చలిగాలిలోన..అదిరే పని మొదలెడదామా
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన
అబ్బబ్బా..ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన
అబ్బబ్బా..ఇది ఏమి వాన

చరణం::2

హద్దులు మీరిన ఆవేశం..తలుపే తడుతుంటే
అల్లరి ఆశల ఆరాటం..రెచ్చి రేగుతుంటే
తుంటరి చేతుల పిల్లాడా..తడిమే పని రద్దు
కమ్ముకుపోయిన వేళల్లో..గుట్టు దాచవద్దు
ఒడిలో బంగారు చేప పడితే..నీ కంతటి ఊపా
ఆ..ఒడిలో బంగారు చేప పడితే..నీ కంతటి ఊపా
తడిలో అందాల పాప..పడితే పులుసౌతది చేప
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన
అబ్బబ్బా..ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన
అబ్బబ్బా..ఇది ఏమి వాన

Tuesday, January 29, 2013

పిల్లజమిందార్--1980




పిల్లజమిందార్--1980
సంగీతం::చక్రవర్తి
రచన::వడ్డేపల్లి కృష్ణ
గానం::S.P.బాలు , P.సుశీల ,  S.P.శైలజ


పల్లవి::

నీ చూపులోనా..విరజాజి వానా
ఆ వానలోనా నేను తడిసేనా..హాయిగా

నీ నవ్వులోనా..రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా..తీయగా

చరణం::1

ఆ వెన్నెలేమో..పరదాలు వేసే
నీ వన్నెలేమో..సరదాలు చేసే
ఆ వెన్నెలేమో..పరదాలు వేసే
నీ వన్నెలేమో..సరదాలు చేసే
వయసేమో పొంగిందీ..వలపేమొ రేగిందీ
వయసేమో పొంగిందీ..వలపేమొ రేగిందీ
కనివిని ఎరుగని తలపులు చిగురించే

నీ చూపులోనా..విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా..హాయిగా

నీ నవ్వులోనా..వడగళ్ల వానా
ఆ వానలోనా నేను మునిగేనా..తేలనా

చరణం::2

చిరుగాలిలోనా..చిగురాకు ఊగే
చెలి కులుకులోనా..పరువాలు ఊగే

ఈ పాల రేయీ..మురిపించె నన్ను
మురిపాలలోనా..ఇరికించె నన్ను

గిలిగింత కలిగించే..మనసంత పులకించే
జాబిల్లి కవ్వించే..నిలువెల్ల దహియించే
చెరగని.. తరగని..వలపులు కురిపించే

నీ చూపులోనా..విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా..హాయిగా

నీ నవ్వులోనా..రతనాల వానా

ఆ వానలోనా నేను మరిచేనా..తీయగా

Sunday, October 14, 2012

యముడికి మొగుడు--1988



సంగీతం::రాజ్ కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S. జానకి
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రాధ,కైకాలసత్యనారాయణ,కోటాశ్రీనివాస్‌రావు,అల్లురామలింగయ్య.

పల్లవి::

వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో

ఓ ఓ ..
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో
జతులాడాలి జత చేరుకో

ఓ ఓ..వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా

చరణం::1

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో
వద్దు లేదు నా భాషలో
మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో
హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే సోకితే కోరికన్నదే రేగదా
వడగట్టేసి బిడియాలనే ఒడిచేరాను వాటేసుకో

మ్మ్..వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా

చరణం::2

అందమంత జల్లుమంటే అడ్డు తాకునా
చీరకట్టు తానాగునా
పాలపుంత ఎల్లువైతే పొంగు దాగునా
జారుపైట తానాగునా
కొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో
ఓ ఓ..వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా
చితచితలాడు ఈ చిందులో
జతులాడాలి జత చేరుకో..ఓ ఓ  

Saturday, October 13, 2012

కొండవీటి సింహం--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao 
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్. 

:::::::::

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 
నీలో గోదారి పొంగే 
నీ పొంగులలో మునిగి  నీ కౌగిలిలో కరిగి 
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే 
నీలో నా ఈడు పొంగే 
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే

చరణం::1 

ఆకాశమంతా  పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
ఆకాశమంతా  పందిళ్ళు వేసి 
భూలోకమంతా పీటల్లు వేసి

కౌగిళ్ళలోనే నా ఇళ్లు చూసి 
నీ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి 

త్వరపడి మది  త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి వడిలో చెలరేగితే 
నాలో నీలో 
తొలి కోరిక చలి తీరక నిను చేరగా 
తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 
నీలో గోదారి పొంగే
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే

చరణం::2

కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే 
కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే 
నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే 
నీవే....నేనై 
తొలి జంటగా చలిమంటలే ఎదనంటగా 
రగిలెను సెగలకు వగలీ చలిమంటలో  

వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే 
నీలో నా ఈడు పొంగే
నీ పొంగులలో మునిగి  నీ కౌగిలిలో కరిగి 
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

Sunday, September 23, 2012

అడవి దొంగ--1985



సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి సుందర రామమూర్తి  
గానం::S.P.బాలు, S.జానకి 
తారాగణం::చిరంజీవి,రాధ,శారద 

పల్లవి: 

అ ఆ ఆ వానా వానా వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 
నీవే ముద్దుకు మూలధనం 
పడుచు గుండెలో గుప్తధనం 
ఇద్దరి వలపుల ఇంధనం 
ఎంత కురిసినా కాదనం 
ఏమి తడిసినా..ఆ..ఆ..వద్దనం..ఈ దినం 

లల్లల్ల..లాలా..లాలా.. 
అ ఆ ఆ వాన వాన వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 

చరణం::1 

చలి పెంచే నీ చక్కదనం..కౌగిట దూరే గాలి గుణం 
గాలి వానల కలిసి రేగుతూ..కమ్ముకుపోతే యవ్వనం 
చినుకు చినుకులో చల్లదనం..చిచ్చులు రేపే చిలిపితనం 
వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం 
మెరుపులు నీలో చూస్తుంటే..ఉరుములు నీలో పుడుతుంటే 
వాటేసుకొని తీర్చుకో..వానదేవుడి వలపు ఋణం..వాన దేవుడి వలపు ఋణం

అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం 

చరణం::2 

కసిగ ఉన్న కన్నెతనం..కలబడుతున్న కమ్మదనం 
చెప్పలేక నీ గుండ వేడిలో..హద్దుకుపోయిన ఆడతనం 
ముద్దుకు దొరికే తియ్యదనం..ముచ్చట జరిగే చాటుతనం 
కోరి కోరి నీ పైట నీడలో..నిద్దుర లేచిన కోడెతనం 
చినుకులు చిట పటమంటుంటే..చెమటలు చందనమౌతుంటే 
చలి చలి పూజలు చెసుకో..శ్రావణమాసం శోభనం..శ్రావణమాసం శోభనం 

అ ఆ ఆ వానా వానా వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 
నీవే ముద్దుకి మూలధనం.. 
పడుచు గుండెలో గుప్తధనం.. 
ఇద్దరి వలపుల ఇంధనం.. 
ఎంత తడిచిన కాదనం.. 
ఏమి తడిసిన వద్దనం..ఈ దినం

లల్లల్ల..లాలా..లాలా.. 
అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 

Sunday, July 31, 2011

ధర్మచక్రం--1981

















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P. సుశీల 
తారాగణం::శోభన్ బాబు, జయప్రద,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,మోహన్ బాబు,రమాప్రభ

పల్లవి::

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

చరణం::1 

నడకే మయూరమాయే
నడుమే వయ్యరమాయే 
మెరుపుగా మారిపోనా 
నీ కళ్లలో కలిసిపోనా

మైకం ఒకింత మైకం
బిడియం రవ్వంత బిడియం
చినుకుగా మారిపోనా 
నీ గుండె పై చేరిపోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు 

చరణం::2

తడిసే చకోరి సొగసు
పొంగే పదారు వయసు 
నా పెదవి కోరుతోంది 
తొలిముద్దు కోరుతోంది

రానీ ముహూర సమయం 
కలలే ఫలించు తరుణం
వలపే నివాళి చేసి 
నిలువెల్ల అల్లుకోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

Monday, April 11, 2011

రహస్య గూఢాచారి--1981



సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,షవుకారుజానకి, 

పల్లవి::

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కలిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో....వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చరణం::1

మబ్బులు ముసిరే..ఏ..మనసులలో
మెరుపై మెరిసే సొగసులలో

వలపే తెలిపే పిలుపులలో
ఉరిమై ఉరిమే వయసులలో

కాముడి గుప్పిటిలోనా
కౌగిలి దుప్పటిలోనా
ఈ ముడి ఎప్పటికైనా 
తప్పదు ఎవ్వరికైనా

కాముడి గుప్పిటిలోనా..ఆ
కౌగిలి దుప్పటిలోనా..ఆ
ఈ ముడి ఎప్పటికైనా..ఆ
తప్పదు ఎవ్వరికైనా..ఆ

చినుకు వణుకు చిచ్చులురేపే 
వెచ్చటి ముచ్చటలోనా..ఆ

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

చరణం:::2

ఎదలో రగిలే..ఎండలలో
మెదిలే వేసవి తపనలు

ఎదలే వెలిగే..కన్నులలో
మెరిసే కాటుక కవితలలో
ఇద్దరి ముద్దులలోనా
తిలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ
తప్పదులే..దేవుడికైనా

ఇద్దరి ముద్దులలోనా
తిలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ
తప్పదులే..దేవుడికైనా

చిటుకు చిటుకు తాళాలేసే
చిత్తడి జల్లులలో

చినుకులలో..వణికి వణికి వణికి వణికి
వణుకులలో..వలచి వలచి వలచి
వలపులలో..కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..జడివానా
ఆ..హా..ఆ

Rahasya Gudhaachaari--1981
Music::ChallaPalli Satyam
Lyrics::?
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Krishna,Jayaprada.

:::

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kalisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO....valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

:::1

mabbulu musirE..E..manasulalO
merupai merisE sogasulalO

valapE telipE pilupulalO
urimai urimE vayasulalO

kaamuDi guppiTilOnaa
kougili duppaTilOnaa
ii muDi eppaTikainaa 
tappadu evvarikainaa

kaamuDi guppiTilOnaa..aa
kougili duppaTilOnaa..aa
ii muDi eppaTikainaa..aa
tappadu evvarikainaa..aa

chinuku vaNuku chichchulurEpE 
vechchaTi muchchaTalOnaa..aa

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

::::2

edalO ragilE..enDalalO
medilE vEsavi tapanalu

edalE veligE..kannulalO
merisE kaaTuka kavitalalO
iddari muddulalOnaa
tilakari valapula vaanaa
endaru Emanu konnaa..aa
tappadulE..dEvuDikainaa

iddari muddulalOnaa
tilakari valapula vaanaa
endaru Emanu konnaa..aa
tappadulE..dEvuDikainaa

chiTuku chiTuku taaLaalEsE
chittaDi jallulalO

chinukulalO..vaNiki vaNiki vaNiki vaNiki
vaNukulalO..valachi valachi valachi
valapulalO..kurisi kalisi melisi pilichi
kurisindii..ii..ii..ii..ii..ii..jaDivaanaa
aa..haa..aa

Saturday, April 03, 2010

భాగ్య చక్రం--1968
























సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::పింగళి 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల  

పల్లవి::

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

హోయ్ వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

చరణం::1

వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరునేలు బాల రాజు చూడరాగా
వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరునేలు బాల రాజు చూడరాగా
కోకిలమ్మ పాట పాడా నెలిమి పిట్ట ఆటలాడా
సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా
వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరద రాజా

చరణం::2

కొండలోన కోనలోనా తిరిగే వేళా
అండదండ నీకు నేనే ఉండాలంటూ 
కొండలోన కోనలోనా తిరిగే వేళా
అండదండ నీకు నేనే ఉండాలంటూ 
పండు వంటి చిన్నవాడు నిండు గుండె వన్నెకాడు
చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

చరణం::3

కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా
కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా
కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా
కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా
మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే
వాణ్ణి చూసి నా మనసు వళ్లె వళ్లే వళ్లే యనగా

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

Monday, March 22, 2010

ఏజెంట్ గోపి--1978



                        
సంగీతం::సత్యం 
రచన::దాశరధి
గానం::S.P.బాలు,P.సుశీల,కోరస్ 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం

పల్లవి::

చిటపటా చినుకులూ..మనకోసం కురిసాయీ
అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి

ఉరుములూ మెరుపులూ..మనలాగే కలిసాయి
అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి

చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ..
మనకోసం కురిసాయీ..

చరణం::1 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఈ చలిగాలి ఎంతో..అల్లరిది
అది నా పైట చెంగే..లాగిందీ
ఈ చలిగాలి ఎంతో..అల్లరిది
అది నా పైట చెంగే..లాగిందీ

ఆ..వెచ్చనీ కౌగిలీ..పైటగా చేసుకో
గాలినీ వాననూ..జంటగా తెలుసుకొ 

చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ..
మనకోసం కురిసాయీ.. 

చరణం::2

నే చూడంది చూసా..ఈనాడు
ఆ చూసింది నాదే..ఏనాడు
నే చూడంది చూసా..ఈనాడు
ఆ చూసింది నాదే..ఏనాడు..హే

అంటగా చూడకూ..సిగ్గులో ముంచకు
అందుకో వలపులూ..పంచుకో తలపులు

ఉరుములూ..అ ఆ ఆ..మెరుపులూ..అ ఆ ఆ
మనలాగే..కలిసాయి
అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి

చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ..
మనకోసం కురిసాయీ..మనకోసం కురిసాయీ


Agent Gopi--1978
Music::Satyam
Lyrics::Daasarathi
Director:: KSR Das
Singer's::S.P.Baalu,S.Suseela Chorus
CAST::Krishna, Jayaprada,Padmanabham,Prabhakar Reddy,Jayamaalini,halam.

:::

chiTapaTaa chinukuluu..manakOsam kurisaayii
avi manalOna EvO..ASalu rEpaayi

urumulU merupulU..manalaagE kalisaayi
avi manalOna EvO..ASalu rEpaayi

chiTapaTaa..a A A..chinukuluu..a A A..
manakOsam kurisaayii..

:::1 
aa aa aa aa aa aa aa aa

ii chaligaali entO..allaridi
adi naa paiTa chengE..laagindii
ii chaligaali entO..allaridi
adi naa paiTa chengE..laagindii

aa..vechchanii kougilii..paiTagaa chEsukO
gaalinii vaananU..janTagaa telusuko 

chiTapaTaa..a A A..chinukuluu..a A A..
manakOsam kurisaayii.. 

:::2

nE chUDandi chUsaa..iinaaDu
A chUsindi naadE..EnaaDu
nE chUDandi chUsaa..iinaaDu
A chUsindi naadE..EnaaDu..hE

anTagaa chUDakU..siggulO munchaku
andukO valapulU..panchukO talapulu

urumulU..a A A..merupulU..a A A
manalaagE..kalisaayi
avi manalOna EvO..ASalu rEpaayi

chiTapaTaa..a A A..chinukuluu..a A A..
manakOsam kurisaayii..manakOsam kurisaayii                                                

Saturday, January 09, 2010

రంగూన్ రౌడి--1979




















సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

చరణం::1

చినుకు మీద చినుకు పడ్దదీ
చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది
వణుకుతున్న వయసు చెడ్దదీ
చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది

ఈ పులకరింత చూడబోతే చిటికెంత
ఆ జలదరింత చూడబోతె జన్మంతా
నాకు నువ్వెంతో..నీకు నేనంతా
నీకు వయసెంతో..నాకు మనసంతా

వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
అహ వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
ఆఁవయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

చరణం::2

చినుకు ముల్లు గుచ్చుకున్నదీ
చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది
వానజల్లు వెచ్చకున్నదీ
చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది

కురిసి వెలసిన వాన వరదంటా
మనసు కలసిన జంట వలపంటా
నీకు మెరుపెంతో..నాకు ఉరుమంతా
వయసు వయసంతా..వలపు గిలిసెంతా

వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

Monday, June 08, 2009

ఇద్దరు అసాధ్యులే--1979




సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::S.P.బాలు,P.సుశీల

Film Director::K. S. R. Das
Starring::Krishna,Rajnikanth,Jayaprada,Geetha,SowcarJanaki.

pallavi::

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ
ఆహా..హా..ఆఅ..ఆఅ..
హ హ హాహా..హాహాహా హహహహ

::::1

చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
ఆఆ..ఆఆ..ఆఆ..
ఊపిరాడలేదని నువ్వు..
ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకూ..
ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకూ

చినుకు చినుకు పడుతూ వుంటే.
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

:::::2

సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
గుట్టునున్న నిను చూస్తుంటే..
కొంటే కోర్కె నా కొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు..
పగ్గాలు లేవింక జంకేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే..ఆ..హా
తడిసి తడిసి ముద్దవుతుంటే..ఆ..హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ష్..ఆ..హా..
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ....
ఈ హాయి లేదోయి ఏ జంటకూ...

Friday, May 22, 2009

కధానాయకుడు--1969


సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P. సుశీల


ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..

ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
తనకు తానై నా రాజు నాతో..
తనకు తానై నా రాజు నాతో..మనసుకలిపే నమ్మా...ఆ..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..

ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా..ఆ
ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..