సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,కె.విజయ, జ్యొతిలక్ష్మి
పల్లవి::
నిదురపో బాబూ నిదురపో
కుదురులేని లోకమందు
నిదుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో
చరణం::1
కన్నవారు నిన్ను గూర్చి ఎన్ని కలలు కన్నారో
ఎన్ని కళ్ళు నిన్ను చూచి ఎర్రబడుతు ఉన్నయో
ఆ కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను
కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను
ఆ కలలు పండే రోజు వరకు కంటిరెప్పగ ఉంటాను
నిదురపో బాబూ నిదురపో
చరణం::2
కొండకవతల సూర్యుడున్నాడు
కోడికూస్తే లేచివస్తాడు
కారుచీకటి కప్పిపెట్టిన
కల్లలన్నీ బయటపెడతాడు
నిదురపో బాబూ నిదురపో
కుదురులేని లోకమందు
దుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో
No comments:
Post a Comment