Sunday, May 17, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::


అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం

ఆ పుణ్యస్థలి అడుగు మోపితే అడుగక దొరుకును ఆత్మానందం 

చరణం::1


పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా

పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా 
నీ పాద కమలములె మాకు శరణ్యము భద్రాచల రామా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే రామా 
భారము నీదే రామా భారము నీదే రామా

చరణం::2


లేక లేకనీ దర్శన భాగ్యము నేటికి కల్గిందీ

రామయ్య తండ్రీ రామయ్య తండ్రీ
రామయ్య తండ్రీ అని నొరారగ పిలవాలని వుంది 
కాని పిలువలేక నా గుండె గొంతుతో కొట్టుక చస్తూంది
పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టబోడు రామా
నీల మేఘశ్యామా శ్రీరామ పరంధామా
నన్నేలుకొమ్ము రామా భద్రాచల రామా
రామా రామా రామా రామా రామా

No comments: