Sunday, May 17, 2009

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి :

ఏదో మైకంలో ఉన్నాను నేను..హహహ
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను..నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

చరణం::1 

నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా మేనిలో నేడేలనో రగిలింది కనరాని జ్వాల..రగిలింది కనరాని జ్వాల  
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా 

చరణం::2

నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
ఈ రేయిలో ఈ వేళలో...తీరాలి 
ఇన్నాళ్ళ దాహం..తీరాలి ఇన్నాళ్ళ దాహం   
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా

చరణం::3

నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
ఆ రూపమే నా కోసమే..నిలిచింది 
నా కళ్ళలోన..నిలిచింది నా కళ్ళలోన  
     
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను...నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

No comments: