సంగీతం::ఘంటసాల రచన:: కొసరాజు గానం::ఘంటసాల పల్లవి:: దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! ఆలోచించండి న్యాయం ఆలోచించండి దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! ఆలోచించండి న్యాయం ఆలోచించండి చరణం::1 దున్నేవాడికి యెక్కడ జూచిన యెన్నో ఈడవలు(?) అబ్బో యెన్నో..పాడవలు(?) దున్నేవాడికి చారెడు నేలయు దొరకగ పోదండి కష్టం విరగడ కాదండి హోయ్..దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! ఆలోచించండి న్యాయం ఆలోచించండి చరణం::2 రెక్కలు విరుచుక శ్రమ పడువానికి బొక్కెడు మెతుకులు కరువండి గుక్కెడు గంజి కరువండి నిక్కుతు తిరిగే సోమరిపోతుకు ఉక్కిరి బిక్కిరి తిండండి డొక్కకు మించిన బరువండి దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! ఆలోచించండి న్యాయం ఆలోచించండి చరణం::3 పచ్చని వన్నెల పైరు జొన్న బల్ పంట బండి తల వంచింది బంగారం వలె మెరిసింది పచ్చని వన్నెల పైరు జొన్న బల్ పంట బండి తల వంచింది బంగారం వలె మెరిసింది కాకుల దరిమే కావలి వాడు ఊత బియ్యముకు నోచక ఉసూరుమంటూ చూస్తూ ఉండే
దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! ఆలోచించండి న్యాయం ఆలోచించండి..ధర్మం ఆలోచించండి..హేయ్..
సంగీతం::ఘంటసాల రచన::సదాశివబ్రహ్మం గానం::ఘంటసాల,జిక్కి,బృందం పల్లవి:: హేయ్య.. ఓ ఓ ఓ ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ ఓ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది చరణం::1 ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై తుఫాను రూపై ధూము ధాములతో తుఫాను రూపై ధూము ధాములతో ప్రపంచాన్నికదలించే..రోజు వస్తుందోయ్ వస్తుంది వస్తుందోయ్ వస్తుంది.. చరణం::2 కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను గర్భదరిద్రుల నుద్ధరించుటకు..గర్భదరిద్రుల నుద్ధరించుటకు దేవుడు తానై దిగి వచ్చే..రోజొస్తుందోయ్ వస్తుంది వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది చరణం::3 ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు కొంపలు భగభగ మండేటప్పుడు నూతులు తవ్వి ఫలితం లేదు వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది చరణం::4 అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ అనురాగం చూపించకపోతే అసూయ పెరిగి విశము గ్రక్కె రోజు వస్తుందోయ్ వస్తుంది కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది చక చక చక వస్తుందోయ్ గబ గబ గబ వస్తుందోయ్ వస్తుంది ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ