Thursday, December 16, 2010

తిరుపతి--1974


సంగీతం::చక్రవర్తి  
రచన::గోపి    
గానం::S.P.బాలు 
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
పల్లవి::

రాయిరా దేవుడు..తాగినా వూగడూ        
రాయిరా దేవుడు..తాగినా వూగడూ        
తాగితే మనుషులూ..తూలుడు పేలుడు
మ్మ్ ఆ హా..రాయిరా...దేవుడూ

చరణం::1

తరచి తరచి..తాగాడు పాలసముద్రం
ఎవడు..వాడే
తరచి తరచి..తాగాడు పాలసముద్రం
తాగిన మైకంలో..చేశాడు ఈ లోకం
ం ఆహా..తాగిన మైకంలో..చేశాడు ఈ లోకం
చేసిన మనుషులకే..ఆటంకమైనాడూ
తను చేసిన మనుషులకే..ఆటంకమైనాడూ 
తమ జోలికి రాకుండా..ఆ..తాగమన్నాడూ
తాగుతున్నాడూ..తాగి లేవనన్నాడూ
అయినా నీకేం నాకేం..పోరా ఫో   
మ్మ్ ఆ హా..రాయిరా...దేవుడూ

చరణం::2

పిలిచి పిలిచి పొయేను..మిగిలిన ప్రాణం
వాబ్బో పిలవకు..ఆ 
పిలిచి పిలిచి పొయేను..మిగిలిన ప్రాణం 
నడి సముద్రంలో..నీ గోడు నీటి పరం
నడి సముద్రంలో..నీ గోడు నీటి పరం 
పుట్టించిన వాడే..పట్టించుకోడురా
నిన్ను పుట్టించిన వాడే..పట్టించుకోడురా
ఉష్..నిద్దుర లేపావా..లోకాన్ని చూస్తాడూ  
పిచ్చెత్తి పోతాడూ..తాగి పలక నంటాడూ   
మ్మ్ అహా..అయినా నీకేం నాకేం..పోరా ఫో       
రాయిరా దేవుడు..తాగినా వూగడూ        

No comments: