సంగీతం::ఘంటసాల
రచన::జంపన
గానం::P.లీల
పల్లవి::
కలువలరాజా కథ వినరావా
కదిలే మదిలో రగిలె నిరాశా
కదిలే మదిలో..ఓఓఓ..కదిలే మదిలో
రగిలె నిరాశా...కలువలరాజా కథ వినరావా
చరణం::1
చూచి చూచి..పూలన్ని రాలె
కలికి కోకిలా..జాలిగాపాడె
చూచి చూచి..పూలన్ని రాలె
కలికి కోకిలా..జాలిగా పాడె
ప్రియుని జేరి..ఒకసారి పిలువవోయ్
ప్రియుని జేరి..ఒకసారి పిలువవోయ్
కంటిముత్యాలె..కాన్కసేతునోయ్
కలువలరాజా కథ వినరావా
చరణం::2
వెదకి వెదకి వేసారినానోయ్
హృదయ వేదనా..ఎరిగింప లేనోయ్
వెదకి వెదకి వేసారినానోయ్
హృదయ వేదనా..ఎరిగింప లేనోయ్
చలువరాతి చెరసాల చాలునోయ్
చలువరాతి చెరసాల చాలునోయ్
సుఖుడే రానిచో నే మనలేనోయ్
సుఖుడే రానిచో నే మనలేనోయ్
కలువలరాజా కథ వినరావా
కలువలరాజా కథ వినరావా
ఓఓఓఓ..రాజా..కథ వినరావా
No comments:
Post a Comment