Tuesday, December 14, 2010

నీతి నిజాయితి--1972


సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::L.R.ఈశ్వరీ 
తారాగణం::సతీష్ అరోరా,కాంచన,గుమ్మడి,నాగభూషణం,కృష్ణంరాజు

పల్లవి::

డుబు డుబు..డుక్..డుక్
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్..గబ గబ..గప్..చిప్ 
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ పాడండీ..అడిగిందానికి చెప్పండీ
అడిగిందానికి చెప్పండీ..ఓ చెపుతాం

చరణం::1

ఒక్క చోటనే...కదలకుండునది
టక్కు టక్కుమని ఆడుతుందది..ఏమిటదీ ?  
బొమ్మా...కాదు...గడియారం 
రెక్కల తోటీ...ఎగురుతుందదీ
చూడడానికీ చూపేలేనిది..ఏమిటది ?
కబోది పక్షి..ఆ..విమానం          
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ పాడండీ..అడిగిందానికి చెప్పండీ 

చరణం::2

అక్కడ ఇక్కడ వుంటుందీ..కబుర్లు అందిస్తుంటుందీ
చెప్పారంటే చక్లెట్ డబ్బా..చెప్పక పోతే బెత్తం దెబ్బా  
అదా..పనిమనిషి కాదు..టెలిఫోన్న్  
గిరగిర తిరుగుతు వుంటుందీ..తియ్యగ పాడుతు వుంటుందీ
గిరగిర తిరుగుతు వుంటుందీ..తియ్యగ పాడుతు వుంటుందీ
నేను చెప్తా..ఊ..చెప్పు 
జ్యోతిలక్ష్మి..ష్..గ్రామఫొన్  
డుబు డుబు..డుక్ డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్న
వ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ..పాడండీ..అడిగిందానికి చెప్పండీ 

చరణం::3

రోజు రోజుకు చిన్నదౌతదీ..
రూపులేకనే కరిగి పోతది..ఏమిటదీ  
చందమామ..సబ్బుబిళ్ళా  
ఒక్కరిద్దరూ పోతుంటారు..ఉండలేక తిరిగొస్తుంటారు
ఎక్కడికీ..ఎక్కడికీ..దొంగతనానికీ 
కాదు....చంద్రమండలానికి..హా హా   
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్

No comments: