Wednesday, December 15, 2010

జయం మనదే--1956




సంగీతం::ఘంటసాల
రచన::కొసరాజు  
గానం::జిక్కి

పల్లవి::

వినవోయీ..ఈ ఈ ఈ..బాటసారి..బాటసారి 
వినవోయీ..బాటసారి..కనవోయీ..ముందుదారి 
వినవోయీ..వినవోయీ..ఈ ఈ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::1

కష్టాలు ఎవరికైన..కలకాలం వుండవోయ్‌
కష్టాలు ఎవరికైన..కలకాలం వుండవోయ్‌
ఆనందం అనుభవించు..అవకాశం కలుగునోయ్‌
తగదోయీ పరితాపం..కదలిరావోయ్‌..ఎదురు లేదోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::2

నిదురబోవులోకాన్ని..చేయితట్టి లేపవోయ్‌
నిదురబోవులోకాన్ని..చేయితట్టి లేపవోయ్‌
అంధకారమంతరించి..వెలుగుజాడ తోచునోయ్‌
కాలం నీకనుకూలం..తలచుకోవోయ్‌..తెలుసుకోవోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::3


నీరసించు శక్తినంత..చేరదీయ బూనవోయ్‌
నీరసించు శక్తినంత..చేరదీయ బూనవోయ్‌
జీవితమ్ము సార్థకమ్ము..చేయుదారి వెదకవోయ్‌
జనవాక్యం మనదేనోయ్‌..భయము లేదోయ్‌..జయము నీదోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

No comments: