Wednesday, December 15, 2010

జయం మనదే--1956

సంగీతం::ఘంటసాల
రచన::సదాశివబ్రహ్మం 
గానం::ఘంటసాల,జిక్కి,బృందం 

పల్లవి::

హేయ్య..
ఓ ఓ ఓ ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ ఓ 
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ 
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది
కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::1

ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై 
ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై
తుఫాను రూపై ధూము ధాములతో 
తుఫాను రూపై ధూము ధాములతో
ప్రపంచాన్నికదలించే..రోజు వస్తుందోయ్ వస్తుంది
వస్తుందోయ్ వస్తుంది..

చరణం::2

కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను 
కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను
గర్భదరిద్రుల నుద్ధరించుటకు..గర్భదరిద్రుల నుద్ధరించుటకు
దేవుడు తానై దిగి వచ్చే..రోజొస్తుందోయ్ వస్తుంది  
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::3

ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు   
ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు 
కొంపలు భగభగ మండేటప్పుడు నూతులు తవ్వి ఫలితం లేదు
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::4

అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ 
అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ
అనురాగం చూపించకపోతే అసూయ పెరిగి విశము గ్రక్కె రోజు
వస్తుందోయ్ వస్తుంది

కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
చక చక చక వస్తుందోయ్
గబ గబ గబ వస్తుందోయ్ వస్తుంది
ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

No comments: