Wednesday, December 15, 2010

జయం మనదే--1956

సంగీతం::ఘంటసాల
రచన:: కొసరాజు 
గానం::ఘంటసాల

పల్లవి::

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::1

దున్నేవాడికి యెక్కడ జూచిన యెన్నో ఈడవలు(?)
అబ్బో యెన్నో..పాడవలు(?)

దున్నేవాడికి చారెడు నేలయు దొరకగ పోదండి 
కష్టం విరగడ కాదండి 

హోయ్..దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::2

రెక్కలు విరుచుక శ్రమ పడువానికి
బొక్కెడు మెతుకులు కరువండి
గుక్కెడు గంజి కరువండి
నిక్కుతు తిరిగే సోమరిపోతుకు ఉక్కిరి బిక్కిరి తిండండి
డొక్కకు మించిన బరువండి 

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::3

పచ్చని వన్నెల పైరు జొన్న బల్‍ పంట బండి తల వంచింది
బంగారం వలె మెరిసింది 
పచ్చని వన్నెల పైరు జొన్న బల్‍ పంట బండి తల వంచింది
బంగారం వలె మెరిసింది
కాకుల దరిమే కావలి వాడు ఊత బియ్యముకు నోచక ఉసూరుమంటూ
చూస్తూ ఉండే

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి..ధర్మం ఆలోచించండి..హేయ్..

No comments: