Tuesday, December 14, 2010

నీతి నిజాయితి--1972



సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::ఘంటసాల,S.P.బాలు
తారాగణం::సతీష్ అరోరా,కాంచన,గుమ్మడి,నాగభూషణం,కృష్ణంరాజు

పల్లవి::

భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే 

భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలేలే 

మంచికాలం వచ్చినపుడే..దంచికొట్టరా
సంచులు నించు ప్లానులేవో..ఎంచివేయరా
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్  
            
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలేలే

చరణం::1

రేసు హార్పు కొంటా..దర్భీ గెల్చుకుంటా
ఖర్చు అయిన డబ్బునెల్ల..డబుల్ లాగుకుంటా
హే భాయ్...ఓహోయ్   
పల్లెటూర్కి తిరిగె పోతా..స్టయిలుగాను హోటల్ పెడతా
ఆరునెలల కాకముందే..ఊరునిండా మేడలు కడతా..ఆ
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్             
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే

చరణం::2

నైటు క్లబ్బు పెట్టేస్తా..న్యుడు కళను పోషిస్తా 
బ్లాకు మనీ పోగు చేస్తా..సిటీలన్నీ యేలేస్తా 
బోస్..యస్
అన్ని ఓట్లు కొనివేస్తా..ఎన్నికల్లో గెలిచేస్తా
పార్లమెంటు మెంబరునై..పర్మిట్లన్నీ కొట్టేస్తా..ఆ  
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్             
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే

చరణం::3

స్టంటు పిక్చరు తీస్తా..డిస్యుం..డిస్యుం..ధనము దోచుకుంటా
స్టంటు పిక్చరు తీస్తా..ధనము దోచుకుంటా
అమెరికాకు పోతా..అనుభవాలు రాస్తా
హే..భాయ్..ఒహోయ్ 
రష్యాకు ట్రిప్పువేసి..రాకెట్టును కొట్టుకొచ్చి 
రష్యాకు ట్రిప్పువేసి..రాకెట్టును కొట్టుకొచ్చి 
పల్లెనుండి మూనుదాకా..రాచబాట వేసేస్తా..ఆ
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్                 
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే
మనం రాజాలే..మనం..రాజాలే..మనం రాజాలే

No comments: