Tuesday, November 22, 2011

అభిమానవంతులు--1973






















సంగీత::S.P.కోదండపాణి
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల,S.P.బాలు,నవకాంత్,కౌసల్య
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ

పల్లవి::

చేయి కలిపి మనసు నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా

చరణం::1

చెమటదీసీ వళ్ళు వంచీ..చాకిరి చెయ్యాలిరా 
వీటుబోయిన బీటినేలను..పాటుకు తేవాలిరా 
కన్నతల్లిగా కల్పవల్లిగా..కన్నతల్లిగా కల్పవల్లిగా 
ఏ ప్రొద్దు భూమాత..వెన్నాని నిలవాలిరా 
హేయ్...చేయి కలిపి మనసు నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా

చరణం::2
      
ఇంటి ఇల్లాలు జంటగా వుండి..వెంట రావాలిరా 
కంటి సైగతో గట్టుపై నుండి..కలకల నవ్వాలిరా
పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా..పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా 
సంసారం ముందడుగు..వెయ్యాలిరా 
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా   

చరణం::3

మనిషిని నమ్మితే..ఫలితం లేదురా 
మట్టిని నమ్మాలిరా..కడవల పాలూ 
కమ్మగ పిండే గోవును..నమ్మాలిరా 
కరువు తీరగా..ఆశలూరగా 
కరువు తీరగా..ఆశలూరగా 
సరదాగ మన బ్రతుకు..జరిగేనురా
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా    
ఓహో..ఓహో..ఓహో..హో..ఓహోహో..ఓఓఓ..ఓహోహో

No comments: