Wednesday, May 15, 2013

అందం కోసం పందెం--1971


Kannu Chithare Kanni Vayase - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి
రచన::వీటూరి 
గానం::P.సుశీల 
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం
ఆ సంగీతానికి శృతి జతచేస్తే శృంగారంగ మారేను 
యీ కన్నెకు తగిన కాంతుడువస్తే గారాలన్నీ తీరేను
హోయ్..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్నుచెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

చరణం::1

చిరు గాలి కూడా సెగలాయే నమ్మా 
యీ వింత యేమో వివరించుమా
చిరు గాలి కూడా సెగలాయే నమ్మా 
యీవింత యేమో వివరించుమా 
అది కాముడు చేసే దాడి విరిశరములు 
ఎంతో వాడి తొలివయసున కలిగే వేడి
ఆ..ఆపలేని మైకమే ఓపలేని మోహమే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

చరణం::2

నా తనువు తూలే నయనాలు సొలే 
లోలోన ఏవో పులకింతలే
నా తనువు తూలే నయనాలు 
సొలే లోలోన ఏవో పులకింతలే
ప్రతి కన్నెకు ఇది సహజములే 
పతి కౌగిలితో నయమగులే
నీ ముచ్చటలన్నీ తీరునులే 
ఆ..తీయనైనా వేదనా మధురమైనా భావనా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

No comments: