Tuesday, November 22, 2011

అభిమానవంతులు--1973



























సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ

పల్లవి::

ఓ మనసు దోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా 
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే  
ఓ చిలిపి నవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా 
నీకు నాప్తె ఇంతప్రేమ..ఎందుకోసమొ చెప్పవా  

చరణం::1

చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం  
గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం  
చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం  
గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం             
మనలోని అనురాగం..పెనవేసింది అందుకే
  
ఓ మనసుదోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా 
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే  

చరణం::2

వలపుకోరీ కన్నవారికి..దూరమైన చిన్నదానా  
నీవు నన్ను వలచినపుడే..జీవితంలో పూలవాన 
నీ మనసే నాదైతే నీ మనసే నాదైతే..లేనిది ఎదీ లేదులే   
ఓ చిలిపినవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా  
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే      
ఆ  ఆ ఆ  ఆ ఆహా..ఓ  ఓ ఓ  ఓ మ్మ్ మ్మ్ మ్మ్  

No comments: