Monday, December 12, 2011

మంచి కుటుంబం--1967




సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.జానకి,B.వసంత

పల్లవి::

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు

చరణం::1

బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
జరిగేను కళ్యాణ వైభోగం 
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::2

కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా..ఆ..పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
లతవోలే జత గూడి లాలింతునే 

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::3

ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో..ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి..తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల...బంధింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు


No comments: