Friday, November 04, 2011

దేవత--1965



సంగీతం::S. P. కోదండపాణి
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల

Film Directed By::K.HemaambharadhgaraRao 
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. 

పల్లవి::


ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం::1


పతిదేవుని మురిపించే వలపుల వీణా

జీవితమే పండించే నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధురభావనా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం::2


సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

No comments: