Monday, July 23, 2012

సీతారామ కళ్యాణం--1961














సంగీతం::గాలిపెంచెల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::P.లీల
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను
మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::1

బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసూ పొంకములోన
సంగీత నాట్యాల నెైపుణిలోన
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ 
సంగీత నాట్యాల నెైపుణిలోన
నా సాటి నెరజాణ కనరాదుగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::2

మగువల నొల్లని మునియైనా..ఆ
మగువల నొల్లని మునియైనా
నా నగుమోమునుగన చేజాచడా
యాగము యోగము దానములన్నీ
యాగము యోగము దానములన్నీ
నా బిగికౌగిలి సుఖమునకేగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

No comments: