సంగీతం::సాలూరి రాజేశ్వర్ రావు
రచన::సముద్రాల రాఘవాచార్య(సీనియర్ )
గానం::P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,రేలంగి,పద్మనాభం,
హరనాధ్, అంజలీదేవి,జయంతి,బేబి రోజా రమణి
కరహరప్రియ::రాగం
పల్లవి::
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా
నా భారము నీవే కదా
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ
నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా
హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా
No comments:
Post a Comment