Monday, September 21, 2015

భక్త ప్రహ్లాద--1967



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సముద్రాలరాఘవాచారి
గానం::P.సుశీల
తారాగణం::హరినాథ్,S.V.రంగారావు,అంజలిదేవి,బేబిరోజారమణి రమణారెడ్డి,

పల్లవి::

ఆదుకోవయ్యా..ఓ..రమేశా..ఆ..ఆదుకోవయ్యా
పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవ
భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా..ఆ
ఆదుకోవయ్యా

బృందం:: 

సర్వలోకకారణా..సకలశోక వారణా
జన్మజన్మకారణా..జన్మబంధ మోచనా..ఆ
దుష్టగర్వ శిక్షణా..శిష్ట శాంతి రక్షణా..శాంతి రక్షణా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీపద యుగళీ సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా ..పన్నగశయనా నారాయణా
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

భవజాధినిబడి తేలగలేని..జీవులబ్రోచే పరమపురుషా 
నను కాపాడి నీ బిరుదమునూ..నిలుపుకొంటివా శ్రితమందారా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

విశ్వమునిందీ వెలిగే నీవే..నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగ్నేలా..విషధర శయనా విశ్వపాలనా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా దేవా

No comments: