Sunday, July 05, 2015

బాటసారి--1961



సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల సీనియర్
గానం::P.భానుమతి 
భరణీ వారి

దర్శకత్వం::రామకృష్ణ
తారాగణం::అక్కినేని,P.భానుమతి,జానకి,రమణమూర్తి,సూర్యకాంతం,ఛాయాదేవి,దేవిక

పల్లవి::

ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
నిలాపనిందలే..ఈ లోక నైజమా
న్యాయమే..కానగజాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::1

పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::2

నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే..కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

No comments: