Showing posts with label బాటసారి--1961. Show all posts
Showing posts with label బాటసారి--1961. Show all posts

Sunday, July 05, 2015

బాటసారి--1961



సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల సీనియర్
గానం::P.భానుమతి 
భరణీ వారి

దర్శకత్వం::రామకృష్ణ
తారాగణం::అక్కినేని,P.భానుమతి,జానకి,రమణమూర్తి,సూర్యకాంతం,ఛాయాదేవి,దేవిక

పల్లవి::

ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
నిలాపనిందలే..ఈ లోక నైజమా
న్యాయమే..కానగజాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::1

పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::2

నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే..కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

Thursday, March 31, 2011

బాటసారి--1961




సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల
గానం::భానుమతి
నటీ నటులు::ANR,భానుమతి,షవుకారు జానకి



ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన
ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన

సమాజానికి..దైవానికి..బలియైతినేను..వెలియైతినే
వగేగానికాని నీపై పగ నేనోచుకోల
ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన

శృతే చేసినావు..ఈ మూగవీణ
సుధామాధురి..చవే చూపినావు
సదా మాసిపోని..స్మృతే నాకు నీవే..
మనోవీణ నేను కొనిపోయెనోయి

ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన

బాటసారి--1961




సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల
గానం::జిక్కి,భానుమతి

కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని

సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే

వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం నువ్వు సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

బాటసారి--1961



బాటసారి
సంగీతం::వేణు
రచన::
గానం::P.లీల

పల్లవి::

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం::1

నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి

శరణమునీవే దేవి కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి

చరణం::2

మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా
కథ వ్యధగా ముగిసేనా

మాపై జాలిని పూనవా
ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిస