సంగీతం::K.V.మహాదేవన్
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్)
గానం::S.P.బాలు
తారాగణం::చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ
పల్లవి::
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ
చెప్పందే తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చరణం::1
గట్టుమీద కొంగను చూసి
చెట్టుమీద డేగను చూసి
చుట్టమని అనుకుంది
చేప పిల్ల పాపం చేపపిల్ల
గట్టుమీద కొంగను చూసి
చెట్టుమీద డేగను చూసి
చుట్టమని అనుకుంది
చేప పిల్ల పాపం చేపపిల్ల
చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి
చేయి చాచి చెలిమిచేయ పిలిచింది..చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్లా
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చరణం::2
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
ఎరవేసిన పిల్లవాడు ఎవరనుకుందో
ఎగిరివచ్చి పడ్డది ఆతని ఒడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే చిలిపి చేపపిల్ల
తాళి లేని తల్లాయె అమ్మచెల్ల
నాన్నలేని పాపతో నవ్వేలోకంలో
ఎన్నాళ్ళు వేగేను చేపతల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి
No comments:
Post a Comment