Monday, March 25, 2013

దొంగరాముడు--1955::శుద్ధసారంగ::రాగం





సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్  
రచన::సముద్రాల
గానం::P.సుశీల 
తారాగణం::నాగేశ్వర రావ్,సావిత్రీ.జగ్గయ్య,జమున.  
శుద్ధసారంగ::రాగం 

పల్లవి::

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బోసి నవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::1

కుల మత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::2

నడుము బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గడ గడ లాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::3

సత్యాహింసలే శాంతి మార్గమని
జగతిని జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

బలే తాత మన బాపూజీ
బాలల తాత బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ   

No comments: