సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల , బృందం తారాగణం::N.T. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు పల్లవి:: భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::1 త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::2 శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు..వీర మాతలు విప్లవ వీరులు..వీర మాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::3 సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా సమతా వాదము వేదముగా సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము..లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::N.T రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు పల్లవి:: ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు గూడు విడిచి వేరైనారు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం::1 జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు..ఎలా భరించేరు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం::2 ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు ఆ తలిదండ్రుల పంచారు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
గుర్ గుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ గుర్ గుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ ఎక్కడ వున్న ఎవ్వరినైనా..ఎక్కడ వున్న ఎవ్వరినైనా పలుకరించి కలుపుతాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ కులము మతము జాతేదైనా..కులము మతము జాతేదైనా కులము మతము జాతేదైనా..కులము మతము జాతేదైనా గుండెలు గొంతులు ఒకటంటాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్ ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు ఒకే తీగ పై నడిపిస్తాడు..ఒకే ప్రపంచం అనిపిస్తాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు చేతులు కలిపి చెమటతో తడిపి చేతులు కలిపి చెమటతో తడిపి కోవెల కడదాం గురుదేవునికి కోవెల కడదాం గురుదేవునికి పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము
ల్లాలాలాల్లాలాలలలల హ్హహ్హహహహహాహ్హాఊఊఊఊఒ
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు వెలుగును తెచ్చే ఈ కిటికీలు పంతులుగారి చల్లని కళ్ళు పంతులుగారి చల్లని కళ్ళు పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము ల్లాలాలాల్లాలాలలలల
సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::P.సుశీల ఆనంద భైరవి::రాగం మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు పండుటాకులము మిగిలితిమి.. పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని ప్రతి జన్మ మీ సన్నిధిలొనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు