Tuesday, November 22, 2011

అభిలాష--1984



సంగీతం::ఇళయరాజ
రచన:::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి


పల్లవి::

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి

జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

చరణం::1

నీ ప్రణయ భావం నా జీవ రాగం
నీ ప్రణయ భావం.. నా జీవ రాగం
రాగాలూ తెలిపే భావాలూ నిజమైనవి
లోకాలూ మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి

జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

చరణం::2

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం.. నీ ప్రేమ నిలయం..
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి

జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

No comments: