Tuesday, November 22, 2011

బడిపంతులు--1972





సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::N.T.రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు, బేబి శ్రీదేవి.

పల్లవి::

ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లాగాడా
నీ వురకలు వూపులు చూస్తుంటే వుండలేకపోతున్నారా..అయ్యో  
ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లాగాడా..హోయ్

చరణం::1

ఎలపట దాసట గిత్తలురెండూ బలిసివున్నాయి..ఓహో
నీ చెయ్యి తగిలితే ఛెంగుఛెంగున ఎగిరే పడతాయి
చెర్నాకోల వుండివుండి ఛెళ్ళుమన్నాది..హోయ్
హా..చెర్నాకోల వుండివుండి ఛెళ్ళుమన్నాది
ఈ చిన్నదానిగుండెలోన ఝల్లుమన్నాదీ..ఈఈఇ    
ఓరోరి పిల్లగాడాఓయ్..ఓయ్..వగలమారి పిల్లాగాడా..ఆ
నీ వురకలు వూపులు చూస్తుంటే వుండలేకపోతున్నారా..హోయ్..హోయ్

చరణం::2
  
పడుచుదనంలా గలగల ఏరు పారుతున్నాది
పైకి చల్లగా లోన వెచ్చగా వేపుతున్నాది..అబ్భా
తడిసిన కోకతెలిసే తెలియని మనసల్లే వుంది
నిలువున నన్ను నీ చూపేమో మింగివేస్తూందీ..అమ్మా..అబ్భా
ఓరోరి పిల్లగాడా..హోయ్

చరణం::3

గూడు వదిలిన గువ్వల్లా ఎగిరిపోదామూ..పోదాము
కోడుకట్టిన పిట్టల్లా కూడివుందాము
దుక్కిదున్నని ఈ చేనల్లే యిన్నాళ్లున్నామూ..అవును
దుక్కిదున్నని ఈ చేనల్లే యిన్నాళ్లున్నామూ
ఇక మొక్కజొన్నతోటల్లే మురిసేపోదాము..అబ్భా,,అభా      
ఓరోరి పిల్లగాడా..ఓయ్..ఓయ్..వగలమారి పిల్లాగాడా..హా..హా
నీ వురకలు వూపులు చూస్తుంటే వుండలేకపోతున్నారా 
ఓరోరి పిల్లగాడా..హోయ్..యే..యహా..

No comments: