Tuesday, November 22, 2011

అంతా మనమంచికే--1972



















సంగీత::P.భానుమతి,సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.భానుమతి
తారాగణం::కృష్ణ,P.భానుమతి,నాగభూషణం,కృష్ణంరాజు, నాగయ్య,సూర్యకాంతం

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా 
మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నువ్వేరా 
చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా 
మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నువ్వేరా  
చల్లగా హాయిగా..ఆ

చరణం::1

ముందుగా రాగల శుభకాలము నీదే నీదే 
కొందరే సుఖపడే యీ లోకము మారెనోయి 
అందరూ ఒకటిగా జీవించు యుగము రావాలి  
చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా 
మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నువ్వేరా  
చల్లగా హాయిగా..ఆ

చరణం::2

ఎవరికీ తెలియని ఏ కొమ్మనుండి పూచావో 
ఎవ్వరూ లేరని ఎలుగెత్తి ఎంత ఏడ్చావో
ఏడ్చితే నీ కనుల నీలాలు ఎవరు తుడిచారో 
ఆడుతూ పాడుతూ నీ జీవ నౌక సాగాలి  
చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా 
మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నువ్వేరా  
చల్లగా హాయిగా..ఆ

No comments: