Sunday, December 04, 2011
ప్రతిజ్ఞ పాలన--1965
సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
పల్లవి::
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
చరణం::1
కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
కనుకలపగ నా వన్నెలు..కడలి పొంగులాయెనే
కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే
ఆనరా..తనెవ్వరా..వరించు..నాథుడే..హా హా హా
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
చరణం::2
అహహా ఒహొహో..
ఓ..ఓ..ఓ..ఓ..
ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో..ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక..జతగూడుట ఎన్నడే..
కానరా నీ నోములూ..ఫలించినప్పుడే
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
Labels:
Hero::Kanta Rao,
P.Suseela,
ప్రతిజ్ఞ పాలన--1965
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment