సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య
పల్లవి::
జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే
జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే
వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది
అవును జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ
చరణం::1
మనసు విరిగి తునకలైతే..ఏఏఏ
తునక తునకలో..నరకమున్నది
లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది
ఈ చేదులోనే ఉన్నది..హాహాహా,,
జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ
చరణం::2
రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే
రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే
మూగ హృదయం..మ్మూఊ..గాయమైనది
ఆ గాయమే ఒక గేయమైనది..ఆ గాయమే ఒక గేయమైనది
జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ
వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది
జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ వెలుతురూ చీకటీ
No comments:
Post a Comment