Sunday, December 04, 2011

ప్రతిజ్ఞ పాలన--1965

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా

సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర::
గానం::సుశీల,బృందం

పల్లవి::

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

ఓ..ఓ..అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

చరణం::1

నుదుట బాసికము నూతన కాంతులమెరిసే..ఏ..ఏ..
మదిలో కోరిక మంగళ గీతం పాడే
వేచిన కనులే..వేయి వలపులై పూచే..ఏ..ఏ..
పూచిన వలపుల..పులకరించునే మేను

ఓయమ్మో..ఓయమ్మో..హోయ్..ఏమంటావ్..?

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

చరణం::2

బుగ్గన పెట్టిన నల్లని చుక్క తానవ్వే..ఏ..ఏ..
సిగ్గుబరువుతో..కన్నె వలపు తలవంచే
జడలో కుట్టిన మొగలిపూవ్వు దీవించే..ఏ..ఏ..
జన్మ..జన్మకు..అతడే..నా మగడమ్మా

ఓయమ్మో..ఓయమ్మో..హోయ్..ఏమంటావ్..?

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

No comments: