Showing posts with label ప్రతిజ్ఞ పాలన--1965. Show all posts
Showing posts with label ప్రతిజ్ఞ పాలన--1965. Show all posts

Sunday, December 04, 2011

ప్రతిజ్ఞ పాలన--1965

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా

సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర::
గానం::సుశీల,బృందం

పల్లవి::

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

ఓ..ఓ..అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

చరణం::1

నుదుట బాసికము నూతన కాంతులమెరిసే..ఏ..ఏ..
మదిలో కోరిక మంగళ గీతం పాడే
వేచిన కనులే..వేయి వలపులై పూచే..ఏ..ఏ..
పూచిన వలపుల..పులకరించునే మేను

ఓయమ్మో..ఓయమ్మో..హోయ్..ఏమంటావ్..?

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

చరణం::2

బుగ్గన పెట్టిన నల్లని చుక్క తానవ్వే..ఏ..ఏ..
సిగ్గుబరువుతో..కన్నె వలపు తలవంచే
జడలో కుట్టిన మొగలిపూవ్వు దీవించే..ఏ..ఏ..
జన్మ..జన్మకు..అతడే..నా మగడమ్మా

ఓయమ్మో..ఓయమ్మో..హోయ్..ఏమంటావ్..?

అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తధాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది

ప్రతిజ్ఞ పాలన--1965::వలజి::రాగం



సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

వలజి::రాగం
{కళావతి--హిందుస్తాని}

పల్లవి::

తలచుకొంటే మేను పులకరించెను
తలచుకొంటే మేను పులకరించెను
ఊహూ..హూ..ఊ..
తమకు తామే కనులు కలలు కాంచెను..ఊ..ఊ..

తలచుకొంటే మేను పులకరించెను..ఊ..ఊ..ఊ..
తనకు తానే చెలియ నన్ను చేరేను..ఊ..ఉం..ఉం..

చరణం::1


అహ..అహ..అహ..ఆ..అహ..అహా..
ప్రియుని సూటిగా చూడ బిడియ మయ్యెనూ..ఒహో..ఓ
చూడకుంటే మనసు ఎటుల నిలిచెను..ఉం..ఉం..ఉమ్మ్
చెలుడు గుస గుస లాడ..సిగ్గు కలిగేను
సుగ్గుపడితే..వలపు చిగురు తొడిగెను..ఊ..ఊ..ఊ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

తలచుకొంటే మేను పులకరించెను..ఓ..
తనకు తానే చెలియ నన్ను చేరేను

చరణం::2


చేయి సోకిన గుండె ఝల్లుమనియేను..ఓహో..ఓహో
ఝల్లుమనీ పిదప చల్లనయ్యెను..ఊం..ఉం
చలువ వెన్నెల వేడి గాడుపయ్యెను
మరుల మాటల వల్ల మంచు కురిసెను..ఊ..ఊ..ఊ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అహ..ఆహా..

తలచుకొంటే మేను పులకరించెను..ఓ..
తనకు తానే చెలియ నన్ను చేరేను

చరణం::3


చెలుని మాటలలో నా మధువు చిందేనూ..ఊ..ఊ..
పలుకు తేనెలు బ్రోలా మైకమయ్యేను
సోలి తడబడి ఎడద ఊయలూగెనూ..ఉ..ఉ..
పిచ్చ్..చ్..పడతి కాంతుని భుజము పానుపయ్యేను..ఉ..ఉ..

తలచుకొంటే మేను పులకరించెను..
ఊహూ..ఊహూ..హూ..
తనివి తీరగా ప్రేమ తానే పండేను
అహ..అహ..హా..అహా..హ..ఆ..ఆహా..హా..

ప్రతిజ్ఞ పాలన--1965


సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

పల్లవి::
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో

చరణం::1
కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
కనుకలపగ నా వన్నెలు..కడలి పొంగులాయెనే
కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే
ఆనరా..తనెవ్వరా..వరించు..నాథుడే..హా హా హా

రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో

చరణం::2
అహహా ఒహొహో..
ఓ..ఓ..ఓ..ఓ..
ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో..ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక..జతగూడుట ఎన్నడే..

కానరా నీ నోములూ..ఫలించినప్పుడే

రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో