సిపాయి చిన్నయ్య 1969
సంగీతం::M.S.విశ్వనాధం
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగా హాయ్ హాయ్
నా సామిరంగా..2
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం
ఆయ్ హాయ్ నా సామిరంగా
ఓయ్ హోయ్ నా సామిరంగా
బతకాలందరు దేశంకోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
స్వార్థమూ వంచన లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ
ఆయ్ హాయ్ నా సామిరంగా
నా సామిరంగా ఓయ్ హోయ్ నా సామిరంగా
2 comments:
ఇందులో చాల చిన్న చిన్న అచ్చుతప్పులు వున్నాయి. పల్లవి లో "హాయ్ హాయ్" కు బదులు "ఆయ్ హాయ్" అని వుండాలి. మొదటి చరణం చివరలో ముందు "ఆయ్ హాయ్ నా సామిరంగా" అని తరువాత "ఓయ్ హోయ్ నా సామిరంగా" అని వుండాలి. అదే విధంగా తరువాతి చరణం లోను, ఆఖరులోను కొన్ని చిన్న సవరణలు వున్నాయి.
నమస్తే సుర్యనారాయణగారు __/\__
మీకు చాలా థాంక్స్ అండీ
ఎప్పుడెప్పుడు మీరువస్తారా అని ఎదురు చుసానండీ
వచ్చేసారు హమ్మయ్య నాకింకేమీ భయం లేదు
తప్పులన్నీ టకటకా Correct చేసేస్తాను :)
Post a Comment