Monday, August 15, 2011

వెలుగునీడలు




పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయ గీతికా
పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయ గీతికా

నేడే స్వాతంత్ర్యదినం..వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం..వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం..ఓ ఓ ఓ

పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయ గీతికా
పాడవోయి భారతీయుడా

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ..
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా !
కదలి సాగవోయి ప్రగతిదారులా !
ఆగకోయి భారతీయుడా !
కదలి సాగవోయి ప్రగతిదారులా !
ఆగకోయి భారతీయుడా !

ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి..బంధుప్రీతి..చీకటి బజారు
అలముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదురించవోయి ఈ పరిస్థితి..ఈ..
కాంచవోయి నేటి దుస్థితి
ఎదురించవోయి ఈ పరిస్థితి..ఈ..
కాంచవోయి నేటి దుస్థితి

పదవీ వ్యామోహాలు..కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు
పదవీ వ్యామోహాలు..కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే..ఏ..
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే !
స్వార్ధ మీ అనర్ధకారణం!
అది చంపుకొనుటె క్షేమదాయకం !
స్వార్ధ మీ అనర్ధకారణం!
అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్ధ మీ అనర్ధకారణం

నవ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం..నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం..నీ లక్ష్యం
నవ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం..
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం..
నవ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం..
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం..
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం..
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
ఆఆఆఆఆఆఅ
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం...

2 comments:

Dr.Suryanarayana Vulimiri said...

పాట ప్రారంభంలో మూడవ లైను తరువాత "నేడే నవోదయం నీదే ఆనందం..ఓ ఓ ఓ" అని వుండాలి.
చరణాల మధ్య స్పేస్ ఇస్తే బాగుంటుంది.
అలాగే సోలోకు బృందానికి గుర్తు వేస్తే బాగుంటుంది.
తరువాతి చరణంలో "స్వార్ధ మీ" కు బదులు "స్వార్ధమే" అని వుండాలి. "అనర్థ దాయకం" కు బదులు "అనర్థ కారణం" అని వుండాలి. ఆఖరున "నవ సమాజ" కు బదులు "సమ సమాజ" అని వుండాలి.

srinath kanna said...

hellO sir !!

meeru cheppinatlu raasaanu ippudu okenaandii :)