రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,రామకృష్ణ బృందం
ఆలాపన::- ఓహో..హో..ఒహోహో..
పల్లవి::-తెలుగు వీర లేవరా..ఆ ఆ ఆ
దీక్షబూని సాగరా..ఆ ఆ ఆ
తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి..తిరుగుబాటు చెయ్యరా
తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి..తిరుగుబాటు చెయ్యరా
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
ఓహో..హో..ఓ ఓ ఓ
చరణం::- దారుణమారణ కాండకు తల్లడిల్ల వద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దారుణమారణ కాండకు తల్లడిల్ల వద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
నిదురవద్దు..బెదరవద్దు..
నింగినీకు హద్దురా..హా..నింగినీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
ఓహో..హో..ఓ ఓ ఓ
చరణం::- ఎవడు వాడు..ఎచటివాడు..
ఎవడు వాడు..ఎచటివాడు..ఇటు వచ్చిన తెల్లవాడు..
ఇటు వచ్చిన తెల్లవాడు
కండబలం..కొండ ఫలం..కబళించిన దుండగీడు..
కబళించిన దుండగీడు..
మానధనం..ప్రాణధనం దోచుకొనే
దొంగవాడు..దోచుకొనే దొంగవాడు
ఎవడువాడు..ఎచటివాడు
ఇటువచ్చిన తెల్లవాడు..తగిన శాస్తి
చెయ్యరా...తగిన శాస్తి చెయ్యరా
తరిమి తరిమి కొట్టరా..తరిమి తరిమి కొట్టరా
బృందం::-తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి..తిరుగుబాటు చెయ్యరా
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::- ఈ దేశం..ఈ రాజ్యం..ఈ దేశం..ఈ రాజ్యం
నాదేనని చాటించి..
బృందం::- నాదేనని చాటించి ప్రతిమనిషి
తొడలు గొట్టి..శృంఖలాలు పగలగొట్టి...శృంఖలాలు పగలగొట్టి
చురకత్తులు పదును బెట్టి
తుది సమరం మొదలు బెట్టి..తుది సమరం మొదలు బెట్టి
సింహాలై గర్జించాలీ..సంహారం సాగించాలీ..
సమ్హారం సాగించాలీ..సమ్హారం సాగించాలీ
వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..
రామకృష్ణ::- ఓ..ఓ..ఓ..ఓ..
స్వాతంత్య్ర వీరుడా! స్వరాజ్య భానుడా!
అల్లూరి సీతారామ రాజా..అల్లూరి సీతారామ రాజా!
బృందం::-స్వాతంత్య్ర వీరుడా! స్వరాజ్య భానుడా!
అల్లూరి సీతారామ రాజా..అల్లూరి సీతారామ రాజా
రామకృష్ణ::- అందుకో మా పూజలందుకో రాజా
బృందం::- అందుకో మా పూజలందుకో రాజా
అల్లూరి సీతారామ రాజా..అల్లూరి సీతారామ రాజా!
రామకృష్ణ::- ఓ..ఓ..ఓ..ఓ.
తెల్లవారి గుండెల్లో నిదురించిన
వాడా ! మా నిదురించిన పౌరుషాగ్ని
రగిలించిన వాడా!
బృందం::- తెల్లవారి గుండెల్లో నిదురించిన
వాడా ! మా నిదురించిన పౌరుషాగ్ని
రగిలించిన వాడా
రామకృష్ణ::-త్యాగాలే భరిస్తాం..కష్టాలే భరిస్తాం
బృందం::- త్యాగాలే భరిస్తాం..కష్టాలే భరిస్తాం
రామ::- నిశ్చయముగ..నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం..
బృందం::-నిశ్చయముగ..నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం..
నీ వెంటనె నడుస్తాం..
బృందం::- ఆఁ..ఆ..
2 comments:
రెండవ చరణంలో.. "కండ బలం కొండ ఫలం" అని వుండాలి. పంక్తుల పంక్చువేషన్ సరి చేస్తే బాగుంటుంది. ఆఖరు చరణంలో "బృందం: అల్లూరి సీతారామరాజా" పాడిన తరువాత రెండు పంక్తులు మరచిపోయారు. అవి "
అందుకో మా పూజలందుకో ఓ రాజా
బృందం: అందులో మా పూజలందుకో ఓ రాజా
అల్లూరి సీతారామ రాజా - 2
namaste sir __/\__
meeru cheppinavi raasesaanandii
elaa marachipoyaano emo tappulu ekkuvagaa unnaayi :(
Post a Comment