Monday, August 15, 2011

త్రిలింగ దేశం మనదేనోయ్


త్రిలింగ దేశం మనదేనోయ్

తెలుంగులంటే మనమేనోయ్

మధురం మధురం మధురం మధురం

ఆంధ్రమ్మంటే అతిమధురం

దేశభాషలా తీరుల్లోకీ..ఆంధ్రమ్మంటే అతిమధురం

రాయలు మనవాడోయ్

పండితరాయలు..మనవాడోయ్

కలం తిక్కనా..ఖడ్గ తిక్కనా

గణపతిదేవులు మనవారోయ్!

అమరావతి నాగార్జున కొండా

సిద్ధహస్తులా శిల్పాలోయ్

మల్లినాధ కుమారిభట్టులు

అందెవేసినా హస్తాలోయ్!

గోదావరి కృష్ణా..తుంగభద్రా పెన్నా

కనిపెంచినవోయ్ తెలుగుజాతిని

వినిపించనవోయ్ వీణానాదం!

ఓడలు కట్టామూ

మిటికి..మేడలు కట్టామూ

మున్నీరంతా ఏకరాశిగా

ముద్దరవేశామూ!

సంతలలో వజ్రాల రాసులూ

జలజలలాడినవీ

కుబేరతుల్యం మహదైశ్వర్యం

గొడుగుపట్టినాదీ!

కలకలలాడే తెలుగుదేవికి

గంధాగరుధూపం

కిలకిలలాడే తెలుంగు కన్నెల

కిన్నెరలాలాపం

బలం గడించీ..వెలుంగునింపే

తెలుంగుజండా "హు"

తెలుంగు భేరీ "ఢాం"

గణగణ గణగణ గణగణ గణగణ..

తెలుంగు జయఘంటా!

గణగణా గణాగణ, గణాగణా గణ..

తెలుంగు జయఘంటా....త్రి||

No comments: