Monday, August 15, 2011
నాదేశం
నేను నాదేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిది దీటు రానిది
శాంతి కి నిలయం మన దేశం
అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన శా౦తి దేశం
బుద్ధం శరణం గచ్ఛామి..ధర్మం శరణం గచ్ఛామి..సంఘం శరణం గచ్ఛామి
అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన శా౦తి దేశం
కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజీ వెలసిన దేశం
వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం
కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజీ వెలసిన దేశం
నేను నాదేశం పవిత్ర భారత దేశం!
కదం తొక్కిన వీర శివాజీ..వీర శివాజీ
వీర విహారిని ఝాన్సి రాణి..ఝాన్సి రాణి
స్వరాజ సమరుడు అల నేతాజీ
జైహింద్ జైహింద్ జైహింద్
స్వరాజ సమరుడు అల నేతాజీ
కట్ట బ్రహ్మణ పుట్టిన దేశం
నేను నాదేశం పవిత్ర భారత దేశం!
ఆజాద్ గోఖలే వల్లభ పటేలు లజపతి తిలక్ నౌరోజీలు
ఆజాద్ గోఖలే వల్లభ పటేలు లజపతి తిలక్ నౌరోజీలు
అ౦బులు కురిపిన మన అల్లూరీ
భగత్ రక్తం చిందిన దేశం
హిందుస్తాన్ హమారా హాయ్..హిందుస్తాన్ హమారా హాయ్..హిందుస్తాన్ హమారా హాయ్
నేను నాదేశం పవిత్ర భారత దేశం!
గు౦డ్ల తుపాకి చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్ర కేసరి
మన ఆంధ్ర కేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రు
శాంతీ..శాంతీ..శాంతీ
శాంతి దూత మన జవహర్ నెహ్రు
లాల్ బహుదుర్ జన్మ దేశం
జై జవాన్..జై కిషాన్..జై జవాన్
నేను నాదేశం పవిత్ర భారత దేశం!
Labels:
దేశభక్తి గీతాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment