రచన::జాలాది
గానం::బాలు,బృందం
బాలు::- పుణ్యభూమి నాదేశం నమో నమామీ..
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ... ||2||
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్నతల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం..నా దేశం..
పుణ్యభూమి నా దేశం నమోనమామీ
ధన్య భూమి నాదేశం సదా స్మరామీ
అదిగో..ఛత్రపతీ..ధ్వజమెత్తిన ప్రజాపతీ..
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝుళిపిస్తే
మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే
కోరస్: ఆ..ఆ..ఆ..ఆ
బాలు: ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి..
మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన
మహా వీరుడూ..సార్వభౌముడూ..
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా..
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జనా.. ||కో||
బాలు::- ఒరేయ్!..ఎందుకు కట్టాలిరా శిస్తూ
నారు పోశావా ? ..నీరు పెట్టావా ?..
కోత కోశావా ?..కుప్పనూర్చావా ??... ఒరేయ్! తెల్లకుక్కా
కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు
శిస్తెందుకు కట్టాలిరా ?
అని ఫెళ..ఫెళ సంకెళ్లు తెంచి..స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడూ
కన్న భూమి నా దేశం నమోనమామీ ||ధన్య||
అదిగదిగో..అదిగదిగో
ఆకాశం భళ్ళున తెల్లారి..వస్తున్నాడదిగో
మన అగ్గి పిడుగు అల్లూరీ..||కో|
బాలు::- ఎవడురా నా భరత జాతిని..కప్పమడిగిన తుచ్ఛుడూ..?
ఎవడు..ఎవడా పొగరు పట్టిన..తెల్లదొరగాడెవ్వడు??
బ్రతుకు తెరువుకు దేశమొచ్చీ..బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన..దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటే..ఉడకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్రనిప్పుల గండ్రగొడ్డలి..పన్నుగడతది..చూడరా
అన్నా..మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి
మందీ మార్బలం మెట్టి..మరఫిరంగు లెక్కుపెట్టి
కో::-..ఆ..ఆ..ఆ..ఆ
బాలు::-వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే వందేమాతరం
కోరస్::-వందేమాతరం
బాలు::- వందేమాతరం
కోరస్::- వందేమాతరం
బాలు::- వందేమాతరం అన్నది ఆ..ఆకాశం
అజాదు హిందు ఫౌజు దళపతీ..నేతాజీ
అఖండ భరత జాతికన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమనీ
స్వతంత్ర భారతావని మన స్వర్గమనీ
ప్రతి మనిషొక సైనికుడై..ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహిందని నడిపాడూ
గగన సిగల కెగసి కనుమరుగై పోయాడూ
కోరస్::- జోహార్..జోహార్..సుభాష్ చంద్రబోస్
జోహార్..జోహార్..సుభాష్ చంద్రబోస్
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలో..అమర జ్యోతులై వెలిగే
ధృవతారల కన్నది ఈ దేశం..
చరితార్థుల కన్నది నా..భారతదేశం..నా దేశం ||పుణ్య||
No comments:
Post a Comment