Monday, August 15, 2011

పవిత్రబంధం




రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల

గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం
సంభవించే కాలమా..||గాంధి|

సస్యశ్యామల దేశం..అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకు ఓటు..బ్రతుకు తెరువుకే లోటు||గాంధి||

సమ్మె ఘొరావు దొమ్మీ..బస్సుల దహనం లూఠీ
శాంత..సహనం సమధర్మంపై విరిగెను గూండాలాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను హింసాద్వేషం..ఏమౌతుందీ దేశం ||గాంధి||

వ్యాపారాలకు పర్మిట్‌..వ్యవహారాలకు లైసెన్స్‌
అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్‌
సిపార్సు లేనిదె స్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం..పెత్తందార్లకె భోజ్యం ||గాంధి||

No comments: