Friday, February 26, 2010

గూఢాచారి 116--1966




ఈ పాట మీకు వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల,బృందం

Film Directed By::M.Mallikaarjuna Rao
తారాగణం::కృష్ణ,జయలలిత,ముక్కామల,రాజబాబు,గీతాంజలి,నెల్లూరుకాంతారావు,రాజనాల.

పల్లవి::

పల్లవి::

ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం::1

మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న...తోటలోన...
మొక్కజొన్న...తోటలోన...
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా

మొక్కజొన్న తోటలోన
మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే..హోయ్
ఒహో..హో..

ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం::2

కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ...రేవు కాడ...
కాకినాడ...రేవు కాడ...
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా

కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా..హోయ్
ఒహోహోయ్..

ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం::3

గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట...చెరువు కాడ...
గండిపేట...చెరువు కాడ...
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా

గండిపేట చెరువు కాడ
గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి
గాండ్రుమంటయే..హోయ్..
ఒహోహోయ్..

ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది


Music::T.Chalapati Raav
Lyrics::C.NaaraayaNa ReDDi
Singer's::Ghantasaala,P.Suseela,Brundam
Film Directed By::M.Mallikaarjuna Rao
Cast::Krishna,Jayalalita,Mukkaamala,Rajababu,Geetaanjali,NellooriKanta Rao,Raajanaala.

:::::::::::::::::::::::::::::::

erraa buggala meeda manasaitae
nuvu aeM chaestaavOy sOggaaDaa
erraa buggala meeda manasaitae
nuvu aeM chaestaavOy sOggaaDaa

erraa buggala meeda manasuMdi
kaani iMdarilO aeM baaguMTuMdi
erraa buggala meeda manasuMdi
kaani iMdarilO aeM baaguMTuMdi

:::1

mokkajonna tOTalOna kalusukuMTavaa
makkuvaMta okkasaari telusukuMTavaa
mokkajonna...tOTalOna...
mokkajonna...tOTalOna...
mokkajonna tOTalOna kalusukuMTavaa
makkuvaMta okkasaari telusukuMTavaa

mokkajonna tOTalOna
makkuvaMta telusukuMTae
nakki unna nakkalannee navvukuMTayae..hOy
ohO..hO..

erraa buggala meeda manasaitae
nuvu aeM chaestaavOy sOggaaDaa

erraa buggala meeda manasuMdi
kaani iMdarilO aeM baaguMTuMdi

:::2

kaakinaaDa raevukaaDa kalusukuMTavaa
naa kaLlalOni baasalannee telapamaMTavaa
kaakinaaDa...raevu kaaDa...
kaakinaaDa...raevu kaaDa...
kaakinaaDa raevukaaDa kalusukuMTavaa
naa kaLlalOni baasalannee telapamaMTavaa

kaakinaaDa raevu kaaDa kaLlu kaLlu kalupukuMTae
ODalOni neeTugaaLlu oorakuMTaraa..hOy
ohOhOy..

erraa buggala meeda manasaitae
nuvu aeM chaestaavOy sOggaaDaa

erraa buggala meeda manasuMdi
kaani iMdarilO aeM baaguMTuMdi

:::3

gaMDipaeTa cheruvukaaDa kalusukuMTavaa
kalusukoni guMDe lOtu telusukuMTavaa
gaMDipaeTa...cheruvu kaaDa...
gaMDipaeTa...cheruvu kaaDa...
gaMDipaeTa cheruvukaaDa kalusukuMTavaa
kalusukoni guMDe lOtu telusukuMTavaa

gaMDipaeTa cheruvu kaaDa
guMDelOtu telusukuMTae
gaMDu pululu poMchi poMchi
gaaMDrumaMTayae..hOy..
ohOhOy..

erraa buggala meeda manasaitae
nuvu aeM chaestaavOy^ sOggaaDaa

erraa buggala meeda manasuMdi

kaani iMdarilO aeM baaguMTuMdi

దేశోద్ధారకులు--1973




సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ
Film Directed By::C.S.Rao
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి:: 

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ
ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు..

చరణం::1

అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ
అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ

తెగిపోయిన తీగలు మీటేవాళ్ళకూ..ఊ..ఊ
నేనేమని చెప్పేదీ..ఈ..ఈ...ఈ
ఏ పాటలు పాడేదీ..ఈ..ఈ..ఈ
అని కన్నీరొలికానూ..ఊ..ఆ కన్నీరంతా కాదూ
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు..

చరణం::2 

అందరిలా పుట్టిన నేనూ
కొందరి ఆశకు బలి అయినాను
అందరిలా పుట్టిన నేనూ
కొందరి ఆశకు బలి అయినాను

నావలే ఎందరో ఉన్నారని తెలిసీ
ఇది ఎవరు చేసిందీ..ఈ..ఈ..ఈ
ఏ దేవుడు రాసిందీ..ఈ..ఈ..ఈ
అని ఎలుగెత్తడిగానూ..ఊ..నా ప్రశ్నకు బదులే లేదూ
నా ప్రశ్నకు బదులే లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు

దేశోద్ధారకులు--1973
























సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::P.సుశీల

తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి: 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు.. 

చరణం::1

ఆకు చాటున మల్లెలాగ..రేకు విప్పిన కలువలాగ 
ఆకు చాటున మల్లెలాగ..రేకు విప్పిన కలువలాగ 
తడిసీ..ఈ..తడవనీ.. 
తడిసీ..ఈ..తడవనీ..పడుచుపిల్లా తలతలమని మెరుస్తుంటే
దొంగ చూపు చూసి కూడా..చూడనట్టే ఉన్నారూ
దొంగ చూపు చూసి కూడా.. చూడనట్టే ఉన్నారూ
కొత్త పాఠం కోసం ఏమో..ఉత్తషాటే చూస్తున్నారు 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు.. 

చరణం::2 

ఈతకోసం వచ్చిన వారు..లోతు చూడక వచ్చేశారు 
గట్టిపోననీ నమ్మీ వస్తే..ఏ..గట్టనెక్కి కూర్చున్నారు
లోతులేని కన్నె మనసున..ఈత నేర్చుకుంటారా..ఆ 
లోతులేని కన్నె మనసున..ఈత నేర్చుకుంటారా..ఆ 
ఓళ్ళు మరచి మునిగినా..నా కళ్ళలోనే తేలుతారు 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు..ఊ..

అంగడి బొమ్మ--1978










సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు
తారాగణం::నారాయణ రావు, సీమ, అంజలీ దేవి

పల్లవి :

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

చరణం::1

నీ అంగ అంగం..మన్మధుని రంగం
నీ మేని పొంకం..రతీ దేవి బింకం
నీ అంగ అంగం..మన్మధుని రంగం
నీ మేని పొంకం..రతీ దేవి బింకం

నీ పైనే మొహం..తుదిలేని దాహం
నువ్వు రేపు తాపం..వరమైన శాపం
నీకే శిల్పి ఇచ్చాడో..ఈ దివ్య  రూపం

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

చరణం::2

నీ మందహాసం..మధుమాస పుష్పం
నీ మధుర గాత్రం..సంగీత శాస్త్రం
నీ మందహాసం..మధుమాస పుష్పం
నీ మధుర గాత్రం..సంగీత శాస్త్రం

దివిలోని వాడు..నిన్నంపినాడు
భువిలోని వాడు..చవి చూచినాడు
అతడానాడే ఐనాడు నీ  దాసుడు

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

Wednesday, February 24, 2010

రాముడు కాదు కృష్ణుడు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::
గానం::S.P.బాలు 

పల్లవి::

మంచు ముత్యానివో..హంపి రాతననివో..ఓ..ఓ 
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో..ఓ.. 
మంచు ముత్యానివో..
మంచు ముత్యానివో..హంపి రాతననివో.
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

చరణం::1

తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో
జానపదమున తీపి కలిపిన నుడికారనివో
గాలి వాటుకు..ఎండ పోటుకు..తాళలేని ఆకు చాటు పిందెవో  
కూచిపూడి కొమ్మవో..కొండపల్లి బొమ్మవో...
ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా.. నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..హంపి రాతననివో
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

చరణం::2

కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో
దేవరయుని శిల్ప చరితకు ప్రాకారానివో 
రెప్ప పాటుకు..లిప్త చూపుకు..అందరాని అందమైన మెరుపువో
మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..
విరగబూసిన నిండు పున్నమికి..తిరగబోసిన పండు వెన్నెలకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా..నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..హంపి రాతననివో
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో.. 

జ్వాల--1985



















సంగీతం::ఇళయరాజ 
రచన::మైలవరపు గోపి 
గానం::S.జానకి 

పల్లవి::

అహా అ హాహా..అహాహా..ఆ ఆ 
ఏవేవో కలలు కన్నాను..మదిలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::1

సుడిగాలులలో..మిణికే దీపం
ఈ కోవెలలో..లో..ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై..నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు 
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::2

నా కన్నులలో..వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా..బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 
ట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 

నాది పేద మనసురా..కాంచలీయలేనురా
కనుల నీరె కాంచరా 

Monday, February 22, 2010

సొమ్మొకడిది సోకొకడిది--1978







సంగీతం::నాగేంద్ర, రాజన్
రచన::వేటూరి
గానం::P.సుశీ
నటీ,నటులు::కమలహసన్,జయసుధ,రోజారమణి,ప్రభాకర రెడ్డి,రాజబాబు, రమాప్రభ, రావి కొండలరావు 

పల్లవి::

ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల..చెంత చేరి సందెవేళ 
అడగలేక అడగలేక అడుగుతుంటే..
జాలిలేదా బాలరాజా..బాలరాజా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా

చరణం::1

మల్లెపూలు ఎర్రగుంటది..ఎన్నలైన ఎండగుంటదీ
మల్లెపూలు ఎర్రగుంటది..ఎన్నలైన ఎండగుంటదీ
వయసువచ్చి వళ్ళు చేస్తది..వగలురేపి ఏడిపిస్తది
నాడి చూస్తవో..రాజా నాటుమందే వేస్తావో..
నీటుగాడ ఘాటుప్రేమ..నాడి చూస్తావో..ఓ..ఓ..
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా

చరణం::2

పొద్దుటేల నిద్దురొస్తదీ..కొత్తబరువు కాతకొస్తదీ
పొద్దుటేల నిద్దురొస్తదీ..కొత్తబరువు కాతకొస్తదీ
అందమంత పందిరేస్తదీ..లేతసొగసు పూతకొస్తదీ
మాత్రవేస్తవో..నాటుమంత్రమేస్తవో..
మోజుతీరి ఫీజు ఇస్తే పుచ్చుకొంటావో..

ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల..చెంత చేరి సందెవేళ 
అడగలేక అడగలేక అడుగుతుంటే..
జాలిలేదా బాలరాజా..బాలరాజా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా

సొమ్మొకడిది సోకొకడిది--1978




సంగీతం::నాగేంద్ర, రాజన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
నటీ,నటులు::కమలహసన్,జయసుధ,రోజారమణి,ప్రభాకర రెడ్డి,రాజబాబు, రమాప్రభ, రావి కొండలరావు 

పల్లవి::

అబ్బో నేరేడు పళ్ళు..
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు 
అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే ఆ పళ్ళు
కైపెక్కే ఆ కళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళూ

అబ్బో నేరేడు పళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు 
అల్లో నేరేడు పళ్ళు

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు..యెదలోన ఎక్కిళ్ళు
కోనేటి కొబ్బరి నీళ్ళూ

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు

చరణం::1

ఆ గిరజాల సరదాలు..చూస్తుంటే
అబ్బా విరజాజి..విరబూసి పోతుంటే
నీ నునుగు మీసాలు చేస్తున్నా మోసాలు
నే తాళలేనమ్మా ఈ రోజు..నే ఓపలేనమ్మా ఆ పోజు

పగటి చుక్క అమ్మాయి..వగల మారి సన్నాయి
మోహాలు దాహాలు..నాలో చెలరేగుతున్నాయి

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు..అల్లో నేరేడు పళ్ళు

చరణం::2


ఆ జెడ పొడుగు..మెడ నునుపు చూస్తుంటే
నా అడుగడుగు..నీవెనకే పడుతుంటే

నీలోని అందాలు వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మా ఈ రోజు..నేనాపలేనమ్మా ఆ మోజు

వగలచూపు అబ్బాయి..పగలు చుక్క కాకోయి
మూడు ముళ్ళు పడేదాక..కాస్త నువ్వు ఆగవోయి

అబ్బో నేరేడు పళ్ళు..అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే ఆ పళ్ళు..కైపెక్కే ఆ కళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళూ..

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు..యెదలోన ఎక్కిళ్ళు
కోనేటి కొబ్బరి నీళ్ళూ

టిక్ టిక్ టిక్--1981








సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు , S.జానకి
నటీ,నటులు::కమల్ హాసన్, రాధ, మాధవి, స్వప్న

పల్లవి::

తకజంతకజంతరిత
తకతరికిటతం..తరికిటజం తరిత
తకతరికిటజం..తజంతరి తరికిటజం
తరికిటతం..తకతిరికిటతం
తకదికుతరికిటతం త
తాక్కు తజంతరిత
తకతరికిటతం..తరికిటజం తరిత
తకతరికిటతం..తాక్కుతజంతరి..తరికిటజంతరి
తక తరికిట తోం..తక తరికిట తోం
తకదికుతరికిటతోం త
తత్తరి తజ్జణు తద్ధిమితా
తకధిమి తజ్జణు తకధిమితా
తఝ్ఝరి కిటతక తరికిట తోం
తఝ్ఝెణు కిటతక తరికిట తోం
తకఝ్ఝెణు కిటతక తరికిట తోం
తధీం గిణతోం..తధీం గిణతోం..తధీం గిణతొం..తా..
తద్దిత్తా..తకఝణుతా
తాదిత్తా.. తకఝణుతా
తాం తకఝణుతం..తకజణుతం...తనతం..
తాం తరికిట తాం తరికిట తాం తరికిట

తాం తరికిట తాం తరికిట తాం

ఓ..నటనమయూరీ వయ్యారీ 
ఓ..నటనమయూరీ వయ్యారీ 
నడయాడే నీ పాదం శ్రీ పాదం 
నడయాడే నీ పాదం శ్రీ పాదం 
నడకలు కులుకులే నీ నాట్యం 
స గ రి గ మ ప ద ని స 
ఓ..సిరి సిరి మువ్వల చిన్నారీ 

I love you I love you I love you 
I love you I love you I love you 

అభినయం అనునయం నీ అందం 
స గ రి గ మ ప ద ని స

చరణం::1 

నీ..చిలిపి కోపం..నా వలపు దీపం 
నీ..నటన వేగం..నా నయన రాగం 
అదో ముద్దు..అదో మత్తు నీకు 
అదే నువ్వు..అదే నవ్వు నాకు 
ఇదే అగ్ని..ఇదే జ్వాల నాకు 
ఇదే లీల..ఇదే హేల నీకు 
వెలయితిని..నేను నిదురకు 
బలైయితిని..నీదు సొగసుకు 
ఈ గడపకు తోరణముగ నేనుండిన చాలంటిని 
స ని ద ప మ ప ద ని 
నా అడుగుల మడుగుల చెలికాడా 

చరణం::2

లలాలలలాలలాలలలలలా

నీ..పెదవి పైనా..నా ప్రేమ రచన 
నీ..మనసులోనా..నా మమత వాన 
ఒకే కోవెలొకే దేవి నాకు 
ఒకే పూవు..ఒకే పూజ నీకు 
ఒకే జపము..ఒకే తమపు నీకు 
ఒకే వరము..ఒకే యుగము నాకు 
తపించితి..నిన్ను పొందక 
తరించితి..నీకు అందక 
నా హృదయము..నా జన్మము 
నీ పరమని నీ వశమని 
స ని ద ప మ ప ద ని 

హో..నటనమయూరీ వయ్యారీ 

I love you I love you I love you 
I love you I love you I love you 

నడకలు కులుకులే నీ నాట్యం 
స గ రి గ మ ప ద ని స 
ఓ..నటనమయూరీ వయ్యారీ

Sunday, February 21, 2010

మా దైవం--1976


సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, P.సుశీల
నటీ,నటులు::NTR,జయచిత్ర

పల్లవి::

మూ..మూ..లాల..లాల..లాల..లాలాలా
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ

చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
ఈ రాజునేకొమ్మ..వలచెనో
తన ఎదలోన..ఏ బొమ్మ నిలిచెనో

చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలుపాలీ
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలుపాలీ
మనసైన ఒక కొమ్మ..వలచింది
నాలో మాటాడే బొమ్మ..నిలిచింది
చల్లని చిరుగాలీ..నీకొక సంగతి తెలపాలీ

చరణం::1

కొమ్మ అనగానే..సరిపోతుందా
బొమ్మ అనగానే..అయిపోతుందా
పేరేలేదా దానికీ..ఊరే లేదా

పరువం ఉరుకుతుంది..ఆ పచ్చని మేని వంపులలో
బిడియం తొణుకుతుంది..ఆ అడుగులు సాగనీ నడకలలో
ఎవరనుకున్నావు..ఆ బొమ్మా
రవ్వల అందాల..వన రాచగుమ్మా
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి

చరణం::2

కబురులతోనే..సరిపోయిందా 
కవిత లల్లితే..అయిపోయిందా
కన్నియ మనసే..కాస్తా కనుగొన్నావా

ఉదయం..పొంగుతుందీ
ఆ సుధకి..ధరహాస కిరణాలలో
హృదయం..పలుకుతుందీ
ఆ ముదిత..మూగ నయనాలలో
ఎప్పుడో ఎప్పుడో..ఈ నేను
ఆ యదనాగలో..వొదిగిపోయాను

చల్లని చిరుగాలీ
నీకొక సంగతి తెలపాలీ
ఈ రాజు వలచిన కొమ్మా
నా యదలోని ఈ పైడి బొమ్మా
చల్లని చిరుగాలీ ఆహ ఆ ఆహ
ఆహ ఆహ ఆ ఓహో ఓహో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

విమల--1960::బేహగ్::రాగం


)


సంగీతం::S.M.సుబ్బయ్య నాయుడు
రచన::ముద్దు కృష్ణ
గానం::ఘంటసాల, రాధా జయలక్ష్మి


బేహగ్::రాగం

పల్లవి::

NTR 

కన్నుల బెళుకే కలువలురా..ఆ..ఆ
కన్నుల బెళుకే కలువలురా
కన్నియ తళుకే కనకమురా
కన్నుల బెళుకే కలువలురా 

కలవోలె కనిపించే..కలవోలె కనిపించే
కలలోనే వలపించే..కలలోనే వలపించే
కనులలొ ఆ రూపె కాపురమైపోయే
కనులలొ ఆ రూపె కాపురమైపోయే

కన్నుల బెళుకే కలువలురా..ఆ..ఆ
కన్నుల బెళుకే కలువలురా

చరణం::1

సావిత్రి::

కనరాని అందాలనే..కనులార కనినంతనే
కనరాని అందాలనే..కనులార కనినంతనే
వనమేమొ ఈ వేళనే..వనమేమొ ఈ వేళనే
నందనమనిపించెనే..నందనమనిపించెనే
విరులన్ని కనువిప్పెనే..విరులన్ని కనువిప్పెనే
చిరునవ్వు చిలికించెనే..చిరునవ్వు చిలికించెనే
ఎనరాని శృంగారమే..ఎనరాని శృంగారమే
హృదయాలు కదిలించెనే..హృదయాలు కదిలించెనే
కనరాని అందాలనే..కనులార కనినంతనే

చరణం::2

సావిత్రీ::

ఇటుచూడు ఇటుచూడవే..ఇటుచూడు ఇటుచూడవే
ఇవి ఏమి మటుమాయమే
ఇటుచూడు ఇటుచూడవే..ఇవి ఏమి మటుమాయమే
ఏ ఏ ఏ..ఇటుచూడు ఇటుచూడవే..ఏ ఏ ఏ  

NTR::

వనరాణీ వగలాడిగా..కనుసైగ కావించగా
వనరాణీ వగలాడిగా..కనుసైగ కావించగా
వనమేమొ ఈ వేళనే..ఏఏ..నందనమనిపించెరా
వనమేమొ ఈ వేళనే..ఏఏ..నందనమనిపించెరా
విరికన్నె కనువిప్పగా..ఆఆ..విరికన్నె కనువిప్పగా
చిరునవ్వు చిలికించగా..ఆఆ..చిరునవ్వు చిలికించగా
ఎనరాని శృంగారమే..ఏఏ..హృదయాలు కరిగించెరా
ఎనరాని శృంగారమే..ఏఏ..హృదయాలు కరిగించెరా..ఆ..ఆ 
వనరాణీ వగలాడిగా..కనుసైగ కావించగా..ఆ..ఆ 
వనరాణీ వగలాడిగా..కనుసైగ కావించగా..ఆ..ఆ 

Sunday, February 14, 2010

శాంతి నివాసం--1960::హిందోళం::రాగం


సంగీతం::ఘంటసాల గారు 
రచన::సముద్రాల 
గానం::P.లీల

హిందోళం::రాగం 

పల్లవి::

తుషార శీతల సరోవరాన 
అనంత నీరవ నిశీధిలోన 
ఈ కలువ నిరీక్షణ..ఆఆ..
నికొరకే..రాజా..వెన్నెల రాజ

కలనైన నీ వలపే
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

చరణం::1

కలువ మిటారపు కమ్మని కలలు
కలువ మిటారపు కమ్మని కలలు 
కళలు కాంతులు నీ కొరకేలే 
కళలు కాంతులు నీ కొరకేలే
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

చరణం::2

కనుల మనోరథ మాధురి దాచి..ఈ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కానుక చేసే వేలకు కాచి
కానుక చేసే వేలకు కాచి
వాడే రేకుల వీడని మమతల 
వేడుచు నీకై వేచి  నిలచెరా 

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

Thursday, February 04, 2010

మాయదారి మల్లిగాడు--1973





















సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

Film Directed By::Adoorti SubbaRao

తారాగణం::కృష్ణ,మంజుళ,జయంతి,పద్మనాభం,నాగభుషణం,అంజలిదేవి,ప్రసన్నరాణి.  

పల్లవి::

మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మా అన్నకు మా చంద్రికి ఇది తొలొరేయీ
నాకిది వరమోయీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ

చరణం::1


గడుసుపిల్లకు వయసునేడే గురుతుకొచ్చిందీ

మొరటువాణ్ణి మనసుదానికి పులకరించిందీ..
గడుసుపిల్లకు వయసునేడే గురుతుకొచ్చిందీ
మొరటువాణ్ణి మనసుదానికి పులకరించిందీ
ఇద్దరికి ఈ నాడు నీవే ముద్దు నేర్పాలీ
ఆ ముద్దుచూసీ చుక్కలే నిను వెక్కిరించాలి
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ

చరణం::2


పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లునాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..
పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లునాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ
ఈ పెళ్ళి చేసి నేనుకూడ ముత్తైదు వైనాను
ఈ పుణ్యమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి


మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మా అన్నకు మా చంద్రికి ఇది తొలొరేయీ
నాకిది వరమోయీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ


Mayadari Malligadu--1973
Music::K.V.Mahadevan
Lyricist::Acharya-Atreya
Singer's:P.Suseela
Film Directed By::Adoorti SubbaRao
Cast::Krishna,Manjula,Jayanti,Padmanabham,Naagabhushanam,Anjalidevi,Prasannaraani.

:::::::::::::::::::

Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Ma annaku..ma chandriki 
idi tolireyi..naakidi varamoyi
Kallukutti..vellakoyi jabilli 
Tellavaraneeyakoyi..ee reyi..ii

::::1

Gadusu pillaku vayasu nede guruthukochindi 
Moratuvaani manasu daaniki pulakarinchindi 
Gadusu pillaku vayasu nede guruthukochindi 
Moratuvaani manasu daaniki pulakarinchindi 
Iddariki eenadu nuvve muddu nerpaali 
Aa muddu chusi..chukkale ninu vekkirinchaali 
Kallukutti vellakoyi..jabilli
Tellavaraneeyakoyi..ee reyi..ii

::::2

Pelli sambaramennaderugani illu naadi 
Pasuputhaade nochukoni bratuku naadi 
Pelli sambaramennaderugani illu naadi 
Pasuputhaade nochukoni bratuku naadi 
Ee pelli chesi nenu kuda muttaiduvainanu 
Ee punyame pai janmalo nanu illaalini cheyaali 

Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Ma annaku..ma chandriki
idi tolireyi..naakidi varamoyi
Kallukutti vellakoyi..jabilli

Tellavaraneeyakoyi..ee reyi..ii

మంచిమనుషులు--1974



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం:: SP. బాలు , p. సుశీల


నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
నిన్నసరె చూపలేదూ..రూపైనా చూడలేదూ
నువ్వుంటే రాకుంటావా..నన్ను చూడకుంటావా
నన్ను చూడకుంటావా....

ఈ ప్రపంచమే అంతే బాబూ..
ఎవరైన నవ్వితే..ఏడుస్తుందీ..
ఏడుస్తే..నవ్వుతుందీ

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొమ్మలేక ఎక్కడైనా..పింద పెరుగుతుందా
కాడలేక ఏనాడైనా..పూవు నిలిచి ఉంటుందా
సౄష్టిలోన జరగని వింతా..మనిషి చేతనవుతుందా
బిడ్డలెరగని తల్లికైనా..పేగు కదలకుంటుందా
ప్రేమ తెలియకుంటుందా..

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొండల్లే నేనున్నానూ..గుండె పగలకా
మంచల్లే నువ్వెళ్ళావూ..మనసు తెలియకా..2
ఎన్నిజన్మలో అనుకొన్నామూ..ఈ కలయికా
నిన్నా..నేడే..మాసిపోతే..రేపులేదికా..రేపులేదికా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

మంచిమనుషులు--1974






సంగీతం::KV . మహాదేవన్
రచన::ఆత్రేయ ,ఆచార్య
గానం::SP .బాలు , P. సుశీల


పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..రగిలిందీ
పెదవీ కదిలిందీ..పంటనొక్కింది

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ

కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
కళ్ళకు జతకుదిరిందీ..కథలెన్నో చెపుతుందీ
పెదవిమీద రాసుందీ..చదివి చెప్పమన్నదీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
గడుసుతనం కొసరీ..ఆ అసలు ఇవ్వనన్నదీ
ప్రతిరోజు కొసరిస్తే..అసలుమించిపోతుందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఇపుడే తెలిసిందీ..ఎప్పుడెప్పుడని ఉందీ
మూడుముళ్ళు వేసిందీ..ఏడడుగులు నడిచిందీ
అందుకే..ఆ విందుకే..అహహా..ఆ ఆ ఆ ఆ ఆ

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిం
దీ