Monday, February 22, 2010

సొమ్మొకడిది సోకొకడిది--1978




సంగీతం::నాగేంద్ర, రాజన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
నటీ,నటులు::కమలహసన్,జయసుధ,రోజారమణి,ప్రభాకర రెడ్డి,రాజబాబు, రమాప్రభ, రావి కొండలరావు 

పల్లవి::

అబ్బో నేరేడు పళ్ళు..
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు 
అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే ఆ పళ్ళు
కైపెక్కే ఆ కళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళూ

అబ్బో నేరేడు పళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు 
అల్లో నేరేడు పళ్ళు

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు..యెదలోన ఎక్కిళ్ళు
కోనేటి కొబ్బరి నీళ్ళూ

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు

చరణం::1

ఆ గిరజాల సరదాలు..చూస్తుంటే
అబ్బా విరజాజి..విరబూసి పోతుంటే
నీ నునుగు మీసాలు చేస్తున్నా మోసాలు
నే తాళలేనమ్మా ఈ రోజు..నే ఓపలేనమ్మా ఆ పోజు

పగటి చుక్క అమ్మాయి..వగల మారి సన్నాయి
మోహాలు దాహాలు..నాలో చెలరేగుతున్నాయి

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు..అల్లో నేరేడు పళ్ళు

చరణం::2


ఆ జెడ పొడుగు..మెడ నునుపు చూస్తుంటే
నా అడుగడుగు..నీవెనకే పడుతుంటే

నీలోని అందాలు వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మా ఈ రోజు..నేనాపలేనమ్మా ఆ మోజు

వగలచూపు అబ్బాయి..పగలు చుక్క కాకోయి
మూడు ముళ్ళు పడేదాక..కాస్త నువ్వు ఆగవోయి

అబ్బో నేరేడు పళ్ళు..అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే ఆ పళ్ళు..కైపెక్కే ఆ కళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళూ..

అమ్మో గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు..గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు..యెదలోన ఎక్కిళ్ళు
కోనేటి కొబ్బరి నీళ్ళూ

No comments: