Friday, February 26, 2010

దేశోద్ధారకులు--1973




సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ
Film Directed By::C.S.Rao
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి:: 

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ
ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు..

చరణం::1

అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ
అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ

తెగిపోయిన తీగలు మీటేవాళ్ళకూ..ఊ..ఊ
నేనేమని చెప్పేదీ..ఈ..ఈ...ఈ
ఏ పాటలు పాడేదీ..ఈ..ఈ..ఈ
అని కన్నీరొలికానూ..ఊ..ఆ కన్నీరంతా కాదూ
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు..

చరణం::2 

అందరిలా పుట్టిన నేనూ
కొందరి ఆశకు బలి అయినాను
అందరిలా పుట్టిన నేనూ
కొందరి ఆశకు బలి అయినాను

నావలే ఎందరో ఉన్నారని తెలిసీ
ఇది ఎవరు చేసిందీ..ఈ..ఈ..ఈ
ఏ దేవుడు రాసిందీ..ఈ..ఈ..ఈ
అని ఎలుగెత్తడిగానూ..ఊ..నా ప్రశ్నకు బదులే లేదూ
నా ప్రశ్నకు బదులే లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు..ఎందరికో హృదయం లేదు

No comments: