సంగీతం::నాగేంద్ర, రాజన్
రచన::వేటూరి
గానం::P.సుశీల
నటీ,నటులు::కమలహసన్,జయసుధ,రోజారమణి,ప్రభాకర రెడ్డి,రాజబాబు, రమాప్రభ, రావి కొండలరావు పల్లవి::
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల..చెంత చేరి సందెవేళ
అడగలేక అడగలేక అడుగుతుంటే..
జాలిలేదా బాలరాజా..బాలరాజా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
చరణం::1
మల్లెపూలు ఎర్రగుంటది..ఎన్నలైన ఎండగుంటదీ
మల్లెపూలు ఎర్రగుంటది..ఎన్నలైన ఎండగుంటదీ
వయసువచ్చి వళ్ళు చేస్తది..వగలురేపి ఏడిపిస్తది
నాడి చూస్తవో..రాజా నాటుమందే వేస్తావో..
నీటుగాడ ఘాటుప్రేమ..నాడి చూస్తావో..ఓ..ఓ..
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
చరణం::2
పొద్దుటేల నిద్దురొస్తదీ..కొత్తబరువు కాతకొస్తదీ
పొద్దుటేల నిద్దురొస్తదీ..కొత్తబరువు కాతకొస్తదీ
అందమంత పందిరేస్తదీ..లేతసొగసు పూతకొస్తదీ
మాత్రవేస్తవో..నాటుమంత్రమేస్తవో..
మోజుతీరి ఫీజు ఇస్తే పుచ్చుకొంటావో..
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల..చెంత చేరి సందెవేళ
అడగలేక అడగలేక అడుగుతుంటే..
జాలిలేదా బాలరాజా..బాలరాజా
ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
No comments:
Post a Comment