Friday, February 26, 2010

అంగడి బొమ్మ--1978










సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు
తారాగణం::నారాయణ రావు, సీమ, అంజలీ దేవి

పల్లవి :

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

చరణం::1

నీ అంగ అంగం..మన్మధుని రంగం
నీ మేని పొంకం..రతీ దేవి బింకం
నీ అంగ అంగం..మన్మధుని రంగం
నీ మేని పొంకం..రతీ దేవి బింకం

నీ పైనే మొహం..తుదిలేని దాహం
నువ్వు రేపు తాపం..వరమైన శాపం
నీకే శిల్పి ఇచ్చాడో..ఈ దివ్య  రూపం

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

చరణం::2

నీ మందహాసం..మధుమాస పుష్పం
నీ మధుర గాత్రం..సంగీత శాస్త్రం
నీ మందహాసం..మధుమాస పుష్పం
నీ మధుర గాత్రం..సంగీత శాస్త్రం

దివిలోని వాడు..నిన్నంపినాడు
భువిలోని వాడు..చవి చూచినాడు
అతడానాడే ఐనాడు నీ  దాసుడు

అహో..అందాల రాశి
ఓహో..అలనాటి ఊర్వశి
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ

No comments: