Thursday, February 04, 2010

మంచిమనుషులు--1974



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం:: SP. బాలు , p. సుశీల


నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
నిన్నసరె చూపలేదూ..రూపైనా చూడలేదూ
నువ్వుంటే రాకుంటావా..నన్ను చూడకుంటావా
నన్ను చూడకుంటావా....

ఈ ప్రపంచమే అంతే బాబూ..
ఎవరైన నవ్వితే..ఏడుస్తుందీ..
ఏడుస్తే..నవ్వుతుందీ

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొమ్మలేక ఎక్కడైనా..పింద పెరుగుతుందా
కాడలేక ఏనాడైనా..పూవు నిలిచి ఉంటుందా
సౄష్టిలోన జరగని వింతా..మనిషి చేతనవుతుందా
బిడ్డలెరగని తల్లికైనా..పేగు కదలకుంటుందా
ప్రేమ తెలియకుంటుందా..

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొండల్లే నేనున్నానూ..గుండె పగలకా
మంచల్లే నువ్వెళ్ళావూ..మనసు తెలియకా..2
ఎన్నిజన్మలో అనుకొన్నామూ..ఈ కలయికా
నిన్నా..నేడే..మాసిపోతే..రేపులేదికా..రేపులేదికా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

No comments: