Thursday, February 04, 2010

మంచిమనుషులు--1974






సంగీతం::KV . మహాదేవన్
రచన::ఆత్రేయ ,ఆచార్య
గానం::SP .బాలు , P. సుశీల


పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..రగిలిందీ
పెదవీ కదిలిందీ..పంటనొక్కింది

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ

కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
కళ్ళకు జతకుదిరిందీ..కథలెన్నో చెపుతుందీ
పెదవిమీద రాసుందీ..చదివి చెప్పమన్నదీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
గడుసుతనం కొసరీ..ఆ అసలు ఇవ్వనన్నదీ
ప్రతిరోజు కొసరిస్తే..అసలుమించిపోతుందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఇపుడే తెలిసిందీ..ఎప్పుడెప్పుడని ఉందీ
మూడుముళ్ళు వేసిందీ..ఏడడుగులు నడిచిందీ
అందుకే..ఆ విందుకే..అహహా..ఆ ఆ ఆ ఆ ఆ

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిం
దీ

No comments: